కరుణానిధి మృతిపై టాలీవుడ్ స్టార్ హీరోల సంతాపం!

tollywood heros condolences to karunanidhi
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతికి సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. తమిళ సినిమాలకు రైటర్ గా పని చేసిన ఆయన రాజకీయాలోకి వెళ్లి తన సత్తా చాటారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతికి సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. తమిళ సినిమాలకు రైటర్ గా పని చేసిన ఆయన రాజకీయాలోకి వెళ్లి తన సత్తా చాటారు. తెలుగు సినిమాలకు కూడా ఆయన సేవలు అందించడం విశేషం. టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ముందుగా బాలకృష్ణ.. 'ఉత్తమ రాజకీయనాయకుడిని కోల్పోయాం. నాన్నగారితో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5సార్లు ముఖ్యమంత్రిగా.. 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర గల మహానుబాహావుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిది' అని అన్నారు. 

మోహన్ బాబు మాట్లాడుతూ.. 'దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన నీడ, బంగారక్క చిత్రాలకు స్వర్గీయ కరుణానిధి గారి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఉత్తమ రాజకీయనాయకుడు మాత్రం కాదు అద్భుత రచయిత. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయి. ఆయన కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి' అన్నారు. 

'డీఎంకే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా 5 సార్లు, ఆరు శతాబ్దాల రాజకీయ జీవితం, తమిళనాడు రాజకీయాలకు భీష్మ పితామహుడు, ద్రవిడుల ఆత్మగౌరవం ‘కలైంజర్’. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి, ఫాలోవర్స్‌కి మరియు తమిళులందరికీ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను' అని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు. 

loader