ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన, జరుగుతున్న చీకటి వ్యవహారంపై గుట్టు విప్పారు. సినిమాల్లో నటించడానికి వచ్చే అమ్మాయిలను వేషాలు ఇప్పిస్తాం అంటూ వారిని లోబరుకోవడం, కురదకపోతే వారిని మానసికంగా.. శారీరకంగా హింసించడం లాంటి చర్యలను తరచూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రంగుల ప్రపంచం వెనుకున్న గుట్టు అన్ని సందర్భాల్లోనూ బయటపడదు. కొన్నిసార్లు ఇలా చేయడానికి ఇష్టం లేక చాలా మంది నటీమణులు ఇండస్ట్రీకి దూరం అయితే కొంతమంది ఈ చీకటి దారిలో నడుస్తూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. అయితే నిజంగానే ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అవకాశాల పేరుతో మహిళా ఆర్టిస్ట్‌లను వాడుకోవడం (కాస్టింగ్ కౌచ్)లో ఉన్న ఇంకో యాంగిల్ ఏంటి? తల్లిదండ్రుల పాత్ర కాస్టింగ్ కౌచ్‌లో ఎంత వరకూ ఉంది? అనే విషయాలపై పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు తమ్మారెడ్డి భరద్వాజ.