బికినీలో మెహ్రీన్.. ఇంత అందమా?

First Published 30, Mar 2018, 3:13 PM IST
tollywood beauty mehreen beautiful in bikini
Highlights
బికినీలో మెహ్రీన్ ఇంత అందంగా వుంటుందా..

టాలీవుడ్ లో ఇటీవల కాలంలో లక్కీ హిరోయిన్ ఎవరంటే మెహ్రీన్ పిర్జాదానే అని చెప్పాలి. నేచురల్ స్టార్ నాని సరసన మెహ్రీన్ నటించిన మొదటి సినిమా కృష్ణ గాడి వీర ప్రేమగాథ హిట్ టాక్ సొంతం చేసుకున్నా... రెండేళ్ళ దాకా గ్యాప్ తప్పలేదు మెహ్రీన్ కు. అయితే మెహ్రీన్ కెరీర్ గత ఏడాది నుంచే స్పీడందుకుంది.

 

శర్వానంద్ తో చేసిన మహానుభావుడు రవితేజతో జట్టు కట్టిన రాజా ది గ్రేట్ రెండు వరసగా సక్సెస్ కావడంతో తన దశ తిరిగిందే అనుకుంటున్న టైంలో సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య - సాయి ధరం తేజ్ జవాన్ స్పీడ్ బ్రేకర్స్ లాగా అడ్డుపడ్డాయి. అయినా కూడా అవకాశాలకు మాత్రం లోటు లేకుండా చూసుకుంటోంది మెహ్రీన్.

 

మెహ్రీన్ ప్రస్తుతం గోపీచంద్ 25వ సినిమా పంతం కోసం విదేశాల్లో ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఆ మూవీ తనకో పెద్ద బ్రేక్ ఇస్తుందని చాలా హోప్స్ పెట్టుకుంది. వచ్చే నెల షూటింగ్ పూర్తి కానున్న పంతం మేలో విడుదల కానుంది.
 


అందాల ఆరబోతకు మొహమాటం లేదని జవాన్ సినిమాతో ఆల్రెడీ చెప్పేసిన మెహ్రీన్ తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ స్టిల్స్ ద్వారా అభిమానుల మతులు పోగొట్టేస్తోంది. అయితే ఎద భాగం వరకు మాత్రమే కనిపించేలా మెహ్రీన్ కేర్ తీసుకుంది. అభిమానులు మాత్రం పూర్తిగా బయటికి వచ్చి ఒక స్టిల్ ఇవ్వొచ్చుగా అని నిట్టూరుస్తున్నారు.

 

ఇబ్బంది ఉంది కాబట్టి సిల్వర్ స్క్రీన్ కోసం కొత్త పేరుతో హీరోగా తీసుకురావాలని మెహ్రీన్ కూడా ట్రై చేస్తోందట. సిఖ్ కుటుంబానికి చెందిన మెహ్రీన్ స్వంత రాష్ట్రం పంజాబ్. స్వతహాగా భరత నాట్య కళాకారిణి అయిన మెహ్రీన్ న్యూయార్క్ లో జరిగిన యంగ్ లీడర్స్ కాన్ఫరెన్స్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది.

loader