తెలుగు యాక్టర్ వినోద్ ఆకస్మిక మృతి

Tollywood actor Vinod dead due to brain stroke
Highlights

హైదరాబాద్‌ : తెలుగు సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు వినోద్‌ ఆకస్మికంగా మరణించారు. ఆయన అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. 
 
ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వినోద్‌ 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. 28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు.

తెలుగు సినిమాల్లో చంటి, నల్లత్రాచు, లారీ డ్రైవర్, ఇంద్ర, నరసింహనాయుడు, భైరవద్వీపం వంటి సినిమాల్లో తన నటన ద్వారా పేరు తెచ్చుకున్నారు. వినోద్‌కు భార్య వీనావతి, పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. 

ఆయన మృతిపట్ల  సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలిపింది.

loader