డ్రంక్ అండ్ డ్రైవ్ లో టాలీవుడ్ నటుడు!

First Published 13, May 2018, 5:46 PM IST
tollyood actor caught for drunk and drive
Highlights

ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడుతోన్న టాలీవుడ్ నటుల 

ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడుతోన్న టాలీవుడ్ నటుల సంఖ్య బాగానే పెరుగుతోంది. తాజాగా మరో నటుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 96 మంది వరకు పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో టాలీవుడ్ కు చెందిన నటుడు కిరీటి దామరాజు కూడా ఉన్నారు.

'ఉయ్యాలా జంపాలా','సెకండ్ హ్యాండ్','ఉన్నది ఒకటే జిందగీ' వంటి చిత్రాల్లో నటించారు. నటుడు కిరీటీ నడిపిన వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు బ్రీత్ ఎనలైజింగ్ పరీక్షలు చేశారు. ఇందులో ఆయన ఆల్కహాల్ లెవెల్ 36గా నమోదైంది. దీంతో కిరీటీ వెహికల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వారికీ కౌన్సెలింగ్ ఇచ్చి ఆ తరువాత కోర్ట్ లో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు. 

loader