టైటిల్ .. ఫస్టులుక్ రేపేనంటూ ఆసక్తిని రేకెత్తిస్తోన్న మారుతి!

First Published 29, Mar 2018, 7:43 PM IST
tittle and fristlook poster from tomorrow
Highlights
టైటిల్ .. ఫస్టులుక్ రేపేనంటూ ఆసక్తిని రేకెత్తిస్తోన్న మారుతి!

 

ఈ మధ్యకాలంలో మారుతి వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ .. తన ప్రత్యేకతను చాటుకుంటూ వెళుతున్నాడు. అలా ప్రస్తుతం ఆయన నాగచైతన్యతో ఒక సినిమా చేస్తున్నాడు. రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి 'శైలజా రెడ్డి అల్లుడు' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

 ఈ నేపథ్యంలో ఆయన ఒక విషయాన్ని ప్రకటిస్తూ పోస్టర్ ను వదిలాడు. మారుతి తన టీమ్ తో కలిసి న్యూ కాన్సెప్ట్ తో విభిన్నమైన ప్రయత్నమేదో చేస్తున్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. టైటిల్ ను .. ఫస్టులుక్ ను రేపు వదులుతామని ఈ పోస్టర్ ద్వారా చెప్పారు. పోస్టర్ లో కరెన్సీ కనిపిస్తుండటం వలన, ఇది డబ్బుకు సంబంధించిన నేపథ్యంలో రూపొందే కథ కావొచ్చనే ఆలోచన కలుగుతోంది. అసలు సంగతేమిటో తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సిందే. 

loader