రామ్ చరణ్ కుమార్తె క్లీంకార పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జూ పార్క్ అధికారులు ఆమె పేరుతో పులి పిల్లకి నామకరణం చేశారు.

క్లీంకార కొణిదెల పుట్టిన రోజు 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకార కొణిదెల ఈరోజు, జూన్ 20న రెండో పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ ప్రత్యేకమైన రోజును మరింత స్పెషల్ గా చేస్తూ హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ అధికారులు చరణ్ కుటుంబానికి ఒక మధురమైన గిఫ్ట్ ఇచ్చారు.

పులిపిల్లని దత్తత తీసుకున్న రామ్ చరణ్ 

రామ్ చరణ్ గత సంవత్సరం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ జూ సందర్శించినప్పుడు, అదే సమయంలో ఓ పులి బేబీ టైగర్ కి జన్మనిచ్చింది. దీనితో రామ్ చరణ్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆ పులిపిల్లని తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దాని బాధ్యత మొత్తం రామ్ చరణే చూసుకుంటున్నాడు. 

పులి పిల్లకి క్లీంకార పేరు 

ఇప్పుడు ఏడాది తర్వాత, ఆ పులి పెద్దదై చలాకీగా కనిపిస్తోంది. నేడు క్లీంకార రెండవ పుట్టిన రోజు కావడంతో ఉపాసన తన కూతురిని జూ పార్క్ కి తీసుకుని వెళ్లారు. రామ్ చరణ్ చేసిన మంచి పనికి గౌరవంగా జూ అధికారులు ఆ పులికి క్లీంకార అని పేరు పెట్టారు. ఈ పులికి క్లీంకార అనే పేరు పెట్టడంతో ఉపాసన చాలా సంతోషంగా ఉన్నారు. క్లీంకారకి అదే పేరుతో ఉన్న పులిని చూపించారు. ఈ దృశ్యాలని ఉపాసన సోషల్ ఇండియాలో షేర్ చేయడం విశేషం. 

ఈ విషయం గురించి ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, “గత సంవత్సరం జూ సందర్శన సమయంలో పుట్టిన పులి ఇప్పుడు మా కుమార్తె పేరు కలిగి ఉంది. ఆమె పుట్టినరోజున ఆ పులిని కలవడం తమకి మరచిపోలేని అనుభూతి,” అని ఉపాసన పేర్కొన్నారు.

View post on Instagram

ఒక సంవత్సరం క్రితం ఇది చిన్న పులి పిల్ల. ఇప్పుడు పులిలా మారింది. మా కుమార్తె పేరుని ఆ పులికి పెట్టినందుకు జూ అధికారులకు ధన్యవాదాలు. వన్యప్రాణులు అడవుల్లోనే ఉండాలని మేము నమ్ముతున్నాం. అయినప్పటికీ బంధించబడిన జంతువులను గౌరవంగా, ప్రేమగా చూసుకోవాలి అని ఉపాసన తెలిపారు. 

రామ్ చరణ్ తన వృత్తి పరంగా ప్రస్తుతం దర్శకుడు బుచిబాబు సానా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ జన్మదినానికి థియేటర్లలో విడుదల కాబోతోంది.

రామ్ చరణ్ కూడా యానిమల్ లవర్. చరణ్ సొంతంగా కొన్ని గుర్రాలని పెంచుతున్నారు. ఉపాసన,రామ్ చరణ్ ల వివాహం 2012లో జరిగింది. పెళ్ళైన 11 ఏళ్ళ తర్వాత వీరికి సంతానం కలిగింది. రామ్ చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచింది. 

రామ్ చరణ్ పెద్ది మూవీ 

దీనితో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పెద్ది టీజర్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ టీజర్ లో రామ్ చరణ్ కొట్టే క్రికెట్ షాట్ ని ఫ్యాన్స్ రీల్స్ రూపంలో రీ క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.