మహేష్ ని కలుసుకోవాలని ఉందా?

ticket new bumper offer for mahesh fans
Highlights

  • మహేష్, రకుల్ జంటగా స్పైడర్
  • ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు స్పైడర్
  • స్పైడర్ టీం ని కలిసే అవకాశం కల్పిస్తున్న టికెట్ న్యూ

మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘స్పైడర్’. మురగదాస్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్.. అభిమానులను ఆకట్టుకుంటోంది.

 

ఇక అసలు విషయానికి వస్తే.. మహేష్ బాబు అభిమానులకు టికెట్ న్యూ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్పైడర్ చిత్ర బృందాన్ని కలుసునే అవకాశాన్ని కల్పిస్తోంది. టికెట్ న్యూ ట్విట్టర్ లో ఒక పజిల్ పెట్టింది. దానిని పూర్తి చేసి తమకు పంపిన వారిలో విజేతను ఎంపిక చేసి.. వారు స్పైడర్ మూవీ టీం ని కలిసే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

 

టికెట్ న్యూ కంపెనీ.. తమ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టర్ ని ఉంచింది. ఆ పోస్టర్ లో రక్తపు మరక, కత్తి, తాడు, కీ, చేతి వేలు లాంటి వాటిని గుర్తించి.. వాటిని సర్కిల్ చేసి తమకు షేర్ చేస్తే స్పైడర్ టీమ్ ని కలుసుకోవచ్చని చెప్పింది. ఇప్పటికే పలువురు వాటిని కనుగోనే పనిలో పడ్డారు. మరికొందరు కనుక్కొని షేర్ చేస్తున్నారు. మీరు కూడా మహేష్ అభిమాని అయితే.. ఇంకెందుకు ఆలస్యం టికెట్ న్యూ ఓపెన్ చేయండి.

 

loader