మెగా హీరో వరుణ్ తేజ్, అందాల తార రాశీఖన్నా కలిసి నటించిన తొలిప్రేమ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతున్నది. తన కెరీర్‌లోనే ఉత్తమ కలెక్షన్లు సాధించిన చిత్రంగా వరుణ్ తేజ్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తున్నది.