‘తొలిప్రేమ’ తొలిరోజు కలెక్షన్స్ అదుర్స్!

First Published 12, Feb 2018, 11:10 AM IST
tholi prema frist day collections
Highlights

‘తొలిప్రేమ’ తొలిరోజు కలెక్షన్స్ అదుర్స్

తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.9.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది

‘తొలిప్రేమ’.. ఈ టైటిల్‌కే బోలెడంత క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా. తన కెరీర్‌లో చిరకాలం నిలిచిపోయే సినిమా. మరి అలాంటి టైటిల్‌ను వరుణ్ తేజ్ మళ్లీ వాడాడు. బాబాయ్ ‘తొలిప్రేమ’ పేరును తన సినిమాతో చెడగొట్టనని విడుదలకు ముందే చాలా నమ్మకంగా చెప్పాడు వరుణ్ తేజ్. అన్నట్టుగానే ఈ ‘తొలిప్రేమ’ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉండటంతో తొలిరోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి.

శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తొలిప్రేమ’ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.9.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ మేరకు ప్రముఖ సినీ వ్యాపార విశ్లేషకుడు రమేష్ బాల ట్వీట్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుండటంతో ఆదివారం బాక్సాఫీసు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.5.18 కోట్లుగా తెలుస్తోంది. దీనిలో తెలుగు రాష్ట్రాల్లో వచ్చినది రూ.3.18 కోట్లు కాగా, యూఎస్‌లో ప్రీమియర్ షోలు, తొలిరోజు కలెక్షన్స్ ద్వారా వచ్చినది రూ.1.48 కోట్లని సమాచారం. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చినది రూ.50 లక్షల షేర్.

ఇదిలా ఉంటే, యూఎస్ బాక్సాఫీసు వద్ద తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన 25వ సినిమాగా ‘తొలిప్రేమ’ నిలిచినట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. విడుదలకు ముందురోజు ప్రివ్యూ షోల ద్వారా 152,171 డాలర్లు (సుమారు రూ.97.72 లక్షలు), తొలిరోజు 139,093 డాలర్లు (సుమారు రూ.89.32 లక్షలు) వసూలు చేసిందని, మొత్తంగా తొలిరోజు కలెక్షన్ 291,264 డాలర్లు (సుమారు రూ.1.87 కోట్లు) అని ఆదర్శ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

loader