వరుస సెలవులు కావడంతో సినిమాల కలెక్షన్ల జోరు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా నేనే రాజు నేనే మంత్రి ఎక్కువ వసూళ్లు తర్వాత జయజానకి నాయక, మరింత వెనుకబడ్డ లై
ఈ వీకెండ్ వరుస సెలవులు రావటంతో తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సినిమాలన్నీ... థియేటర్ల వద్ద బాక్సాఫీస్ కలెక్షన్స్ వేటలో పడ్డాయి. సెలవుల కారణంగా... థియేటర్లు అన్ని ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. గత శుక్రవారం మూడు సినిమాలు థియేటర్లలోకి రావడంతో పాటు మూడు సినిమాలకు మంచి టాక్ రావడంతో మూడు సినిమాలు ఆడుతున్న థియేటర్లు జనంతో సందడి సందడిగా సనిపిస్తున్నాయి. సినిమాలు మూడు మంచి వసూళ్లే సాధిస్తున్నా.. మూడు ఒకేసారి రావడంతో... వసూళ్ల పరంగా మూడింటిపై ప్రభావం పడి... మూడింటికి రావాల్సిందానికన్నా వసూళ్లు తగ్గినట్టే అనుకోవాలి.
అయితే ఓవరాల్‌గా మాత్రం రానా... నేనే రాజు నేనే మంత్రి, బెల్లంకొండ-బోయపాటిల జయ జానకి నాయక సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరాహోరీగా వసూళ్లు రాబడుతున్నాయి. లై మూడో ప్లేస్‌తో సరిపెట్టుకుంటోంది. అయితే నేనే రాజు నేనే మంత్రికి తక్కవ బడ్జెట్ కావడంతో ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది. ఇక జయజానకి నాయక సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంతో పాటు తక్కువ థియేటర్లలో రిలీజ్ కావడంతో రికవరీకి రెండో వారం కూడా పట్టనుంది.
ఇక ఈ రెండు సినిమాల ఐదు రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి.
నేనే రాజు నేనే మంత్రి 5 డేస్ ఏరియా వైజ్ షేర్ :
నైజాం - 5.65 కోట్లు
సీడెడ్ - 1.85
ఉత్తరాంధ్ర - 1.77
వెస్ట్ - 0.60
కృష్ణ - 1.04
ఈస్ట్ - 1.23
గుంటూరు - 1.00
నెల్లూరు - 0.44
ఓవర్సీస్ - 1.32
కర్ణాటక - 1.00
రెస్టాఫ్ ఇండియా - 0.23
----------------------------------------------
టోటల్ 5 డేస్ కలెక్షన్స్ = 16.23 కోట్లు
---------------------------------------------—

జయ జానకి 5 డేస్ ఏరియా వైజ్ షేర్ :
నైజాం - 4.05 కోట్లు
సీడెడ్ - 2.60
ఉత్తరాంధ్ర - 1.83
వెస్ట్ - 0.89
కృష్ణ - 0.75
ఈస్ట్ - 0.98
గుంటూరు - 1.25
నెల్లూరు - 0.65
ఓవర్సీస్ - 0.18
కర్ణాటక - 0.82
రెస్టాఫ్ ఇండియా - 0.40
----------------------------------------------
టోటల్ 5 డేస్ కలెక్షన్స్ = 14.40 కోట్లు
----------------------------------------------

లై 5 డేస్ ఏరియా వైజ్ షేర్ :
నైజాం- 2.78
సీడెడ్ - 0.84
నెల్లూర్- 0.26
కృష్ణా- 0.58
గుంటూరు- 0.55
వైజాగ్- 1.03
తూర్పు గోదావరి- 0.63
పశ్చిమ గోదావరి- 0.33
-----------------------------------------------------------
5 రోజులు ఏపీ& తెలంగాణ షేర్ = 7.00
-----------------------------------------------------------
