సెలబ్రిటీల గురించి లెలుసుకోవాలంటే అందరికీ తెగ ఇష్టం.  రామ్ చరణ్ వైఫ్ ఉపాసనను మెగా ఫ్యాన్స్ తెగ ఫాలో అవుతుంటారు. ఇందుకు కారణం.. చెర్రీ కంటే అతని గురించి ఉపాసనే ఎక్కువగా అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. అటు చరణ్ సినిమా సంగతులు.. ఇటు తమ అనుబంధం.. మరోవైపు మెగా ఫ్యామిలీ రిలేషన్స్.. ఇంకోవైపు సోషల్ యాక్టివిటీస్.. అలాగే హెల్దీ హ్యాబిట్స్.. ఇలా రకరకాల అంశాలపై స్పందిస్తూ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది ఉపాసన. రీసెంట్ గా ఈమె తన రోజు ఎలా ప్రారంభమవుతుందో ఓ ఫోటో తీసి మరీ చూపించింది. ఉదయాన్నే తన మనసుకు హత్తుకునే అంశాలు అంటూ.. గ్రీన్ టీ.. ఒక పెన్.. ఓ న్యూస్ పేపర్.. దానిలో సుడోకు గేమ్.. ఆస్ట్రాలజీ కాలమ్ విపరీతంగా నచ్చుతాయట. అలాగే చెప్పీ చెప్పకుండానే తనది మేష రాశి అనే పాయింట్ ను కూడా వెల్లడించింది ఉపాసన. రోజు ఎలా మొదలవుతుంది అనే అంశాన్ని ఇంత చక్కగా.. ఒకేఒక అందమైన ఫోటోతో ఉపాసన చెప్పిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.