జేమ్స్ కెమరూన్ నుండి మరో అద్భుతం..

The new trailer for James Cameron's Alita
Highlights

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ పేరు తెలియని వారుండరు. ఆయన తెరకెక్కించిన 'టైటానిక్','అవతార్' వంటి సినిమాలు అద్భుతాలు సృష్టించాయి. తాజాగా ఆయన స్క్రీన్ ప్లే అందించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే 'అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్'

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ పేరు తెలియని వారుండరు. ఆయన తెరకెక్కించిన 'టైటానిక్','అవతార్' వంటి సినిమాలు అద్భుతాలు సృష్టించాయి. తాజాగా ఆయన స్క్రీన్ ప్లే అందించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే 'అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్'. రాబర్ట్ రోడ్రిగే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది రోసా సాలాజర్.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఎంతో కాలంగా నిద్రలో ఉన్న అలీటా అనే అమ్మాయి ఒక్కసారిగా మేల్కొంటుంది. అయితే ఆమె అందరిలా కాకుండా బొమ్మలా ఉంటుంది. కానీ ఉక్కులాంటి శరీరం.. తన గతం ఏంటి అనేది ఆమెకు తెలియదు. దాంతో ఆమెను ఈడో అనే డాక్టర్ తనతో పాటు తీసుకువెళ్తాడు. ఆమె గతంలో ఎన్నో అద్భుతాలకు కారణమై ఉంటుందని భావిస్తాడు.

ఈ క్రమంలో అలీటాకు హ్యూగో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అతడు అలీటాకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చే విధంగా సహాయం చేస్తుంటాడు. ఇంతలో ఆమెను అంతం చేయడానికి శక్తులు ఉన్న మరికొందరు ఆమె లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. అప్పుడే తన గతం తనకు గుర్తుకు వస్తుంది. తనకు కూడా పవర్స్ ఉన్నాయని గ్రహిస్తుంది. వారి నుండి తనను తాను ఎలా రక్షించుకుందనేదే ఈ సినిమా కథ. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

loader