బిగ్ బాస్ 3 ఎప్పుడు మొదలవుతుందో గాని టాలీవుడ్ దీనికి సంబందించిన రూమర్స్ డోస్ ఇప్పట్లో తగ్గేలా లేవు. ముఖ్యంగా హోస్టింగ్ విషయంలో ఇప్పుడు మరొక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఫైనల్ జూనియర్ ఎన్టీఆర్ మూడవ సీజన్ కోసం రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో హోస్ట్ విషయంలో ఇతర స్టార్ల పేర్లు గట్టిగా వినిపించిన సంగతి తెలిసిందే. 

వెంకటేష్ - మెగాస్టార్ చిరంజీవి అంటూ చాలా పేర్లు వచ్చాయి. గత ఏడాది నాని చేసిన విధానం బాగానే ఉన్నా కూడా మళ్ళీ బిగ్ బాస్ చేయను అని అతను క్లారిటీ ఇచ్చాడు. ఎవరిని తీసుకున్నా కూడా తారక్ స్థాయిలో వర్కౌట్ చేయలేరేమో అని ఫైనల్ గా బిగ్ బాస్ నిర్వాహకులు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ను బ్రతిమాలినట్లు సమాచారం. 

అయితే మరోవైపు RRR సినిమా చేస్తున్న తారక్ రాజమౌళి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నా కూడా అవతల దర్శకుడు రాజమౌళి ఒప్పుకోవాలి కదా? అనే కామెంట్స్ వచ్చాయి. అది ముమ్మాటికీ నిజమే. ఎందుకంటే జక్కన్న తారక్ చరణ్ ల డేట్స్ ను ఒక ఏడాదివరకు తీసుకొని ఇతర పనుల్లోకి వెళ్లకూడదని ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

కానీ ఇప్పుడు తారక్ కు బిగ్ బాస్ యూనిట్ నుంచి విన్నపాలు ఊపందుకున్నాయి. పైగా రెమ్యునరేషన్ కూడా మూడవ సీజన్ కు గట్టిగా అండ్ అవకాశం ఉన్నట్లు టాక్. దీంతో తారక్ జక్కన్నతో చర్చలు జరిపి బిగ్ బాస్ 3కి ఒకే చెప్పాడట. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తారక్ కి అభిమానులు ఉన్నారు కాబట్టి షో నిర్వాహకులు తారక్ విషయంలో వెనుకడుగు వేయకుండా తారక్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ వార్తలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.   

 

asianet news special

లక్ష నుంచి 25 కోట్లు.. తెలుగు ఓల్డ్ మూవీస్ కలెక్షన్స్ (1933-2002)

బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన బాక్స్ ఆఫీస్ కథలు!

 

 

బిగ్ బాస్ 3: ముగ్గురు ఫిక్స్ అయినట్టే?