బిగ్ బాస్ 2 పూర్తయిన కొన్ని రోజులకే నెక్స్ట్ సీజన్ పై ఎన్ని రూమర్లు వచ్చాయో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ డోస్ మరింతగా పెరిగింది. బిగ్ బాస్ 3 జూన్ లో మొదలుకానుంది. అయితే స్టార్ మా నిర్వాహకులు షోకి సంబందించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంటెస్టెంట్ ల లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హోస్టింగ్ విషయంలో ఓ క్లారిటీ రాకముందే హౌస్ లోకి అడుగుపెట్టబోయే వారి పేర్లు బయటకు రావడంతో ఇది నమ్మే నిజం కాదని కామెంట్స్ వస్తున్నాయి. ఇక లిస్ట్ లో ఉన్న ముగ్గురు దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ - టివి ఆర్టిస్ట్ జాకీ - మహాతల్లి ఫెమ్ జాన్వీ లకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. 

మొత్తంగా 13 మంది పేర్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంత మంది బ్యాక్ గ్రౌండ్ తో బిగ్ బాస్ 3 లో అడుగుపెట్టేందుకు ట్రై చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

త్వరలో బిగ్ బాస్ 3.. సెలబ్రిటీలు వీరేనా..?