రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలకు టాలీవుడ్ మొత్తం ఏకమయ్యింది. ఈ రోజు ఉదయం జరిగిన అత్యవసర భేటీ సినీ ప్రముఖులు మొత్తం హాజరారయ్యారు. సినీరంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ భేటీలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే శ్రీరెడ్డి విషయంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

సుమారు నాలుగు గంటలు జరిగిన ఈ చర్చలో క్యాస్టింగ్ కౌచ్ గురించి, బ్రోకర్ ఏజెన్సీల గురించి ఇండస్ట్రీ లో ఉన్న చిన్న చితకా సమస్యలు గురించి కూడా చర్చించుకున్నట్లు సమాచారం. శ్రీరెడ్డి పై చర్యలు తీసుకోవాలని తనకు ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా భావించినట్లు సమాచారం. అన్ని విషయాల పై ఒక ప్లాన్ తో వెళ్లాలని అందరు నిర్నయించుకుని భేటి ముగించారు.  పవన్ కళ్యాణ్ ఈ చర్చకు హాజరవుతారనుకున్నారు. కానీ ఎందుకో ఆయన రాలేకపోయారు.