భరత్ అనే నేను లో ఛాన్స్ అడిగితే... బట్టలు విప్పి చూపించమన్నాడు

భరత్ అనే నేను లో ఛాన్స్ అడిగితే...  బట్టలు విప్పి చూపించమన్నాడు

శ్రీరెడ్డి కి  మద్దతాదారులు రోజురోజుకు ఎక్కువవుతున్నారు అన్నది వాస్తవం. నిన్న కేంద్రం నుండి మద్దతు కూడా వచ్చేసింది దానికితోడు చాలా ఉద్యమ సంఘాల మద్దతు కూడా ఉండనే ఉంది.  ఇప్పుడిప్పుడే సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తుంది.

ఇప్పుడు శ్రీరెడ్డితో కలిసి మరికొందరు మహిళలు కూడా నోరు విప్పడమే కాదు.. నేరుగా ఆయా వ్యక్తుల పేర్లను చెప్పేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నిర్మాత వాకాడ అప్పారావును కామాంధుడిగా అభివర్ణిస్తూ పలువురు ఆరోపణలు చేశారు. ఖైదీ నంబర్ 150మూవీలో చిరంజీవి గారి సినిమాలో కనిపించేందుకు ఆరాటపడితే.. కమిట్మెంట్ అడిగాడని ఆరోపించారు. అలాగే భరత్ అనే నేను మూవీ కోసం ఛాన్స్ అడిగితే.. ఒక కో డైరెక్టర్ బట్టలు విప్పి చూపించమని అన్నాడని ఓ ఆర్టిస్ట్ చెప్పుకొచ్చింది. 

స్క్రీన్ మీద హీరోలుగా వెలిగిపోతున్న వాళ్లు.. ఈ అంశంపై స్పందించరా అని డిమాండ్ చేశారు వారంతా. చిరంజీవి.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. మహేష్ బాబు.. వీళ్లంతా ఆన్ స్క్రీన్ మాత్రమే హీరోలా.. వారికి ఈ విషయాలు తెలియవా.. తెలిసి కూడా ఊరుకుంటున్నారా.. వారి సినిమాల సమయంలో కూడా ఇలాంటివి జరుగుతున్నపుడు కచ్చితంగా వారు స్పందించాల్సిందే అంటున్నారు టాలీవుడ్ నే నమ్ముకున్న మహిళలు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos