ఈ డ్రామాలు ఏంటి..? బిగ్ బాస్ షోపై నెటిజన్ల ఫైర్!

Telugu Bigg Boss2 Gets Trolled On Social Media
Highlights

ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారికి మళ్ళీ పోలింగ్ ఏంటి..? ఈ డ్రామాలు ఏంటి బిగ్ బాస్..? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి సీజన్ 1 సమయంలో కూడా ముమైత్ రీఎంట్రీ విషయంలో ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి

బిగ్ బాస్ సీజన్ 2 మొదలయ్యి ఆరు వారాలు కావొస్తుంది. ఒక్కో వారానికి ఒక్కో కంటెస్టెంట్ చొప్పున ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు వారిలో ఒకరిని తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ఆన్ లైన్ లో పోల్ నిర్వహించి ఎక్కువ ఓట్లు వచ్చిన పోటీదారుడిని హౌస్ లోకి తిరిగి పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారికి మళ్ళీ పోలింగ్ ఏంటి..? ఈ డ్రామాలు ఏంటి బిగ్ బాస్..? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి సీజన్ 1 సమయంలో కూడా ముమైత్ రీఎంట్రీ విషయంలో ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కావాలనే ఆమెని తిరిగి హౌస్ లోకి పంపించారని విమర్శలు ఎదురయ్యాయి.

ఇప్పుడు ఈ పోలింగ్ ను అడ్డుపెట్టుకొని హౌస్ లోకి తేజస్విని తీసుకువెళ్లబోతున్నారా..? అంటూ కొందరు ప్రశ్నించగా.. ఆ మాత్రం దానికి ఓటింగ్ అని చెప్పి జనాల్ని పిచ్చోల్ని చేస్తున్నారా..? అంటూ మరికొందరు ఈ షోపై ఫైర్ అవుతున్నారు. ఈరోజు రాత్రి నుండి ఓటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ హౌస్ లోకి ఎవరు రీఎంట్రీ ఇస్తారో చూడాలి! 

loader