ఈ వారం ప్రేక్షకుల ముందుకు 12 సినిమాలు..వామ్మో..

First Published 14, Nov 2017, 7:34 PM IST
telugu audience to be flown by 12 movies this week
Highlights
  • ఈవారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన చాలా సినిమాలు
  • 12 సినిమాలు ఈ వారం విడుదలకు సిద్ధం
  • ఇన్ని సినిమాలు రిలీజైన పరిస్థితి చూసి ఎన్నేళ్లయిందో..

 

దసరా దీపావళి పండగ సీజన్ల తర్వాత తెలుగులో మీడియం రేంజ్ హీరోలు,, ఆ తర్వాత డబ్బింగ్  సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ కుప్లాన్ చేసుకుంటున్నాయి. అందుకే నవంబర్ లో చిన్న సినిమాల సందడి, డబ్బింగ్ సినిమాల హంగామా బాగా కనిపిస్తోంది. టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం రెండు మూడు కొత్త చిత్రాలను విడుదల చేస్తూ వుంటారు. అయితే.. వచ్చే శుక్రవారం ఏకంగా 12 సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. అయితతే వీటిలో డబ్బింగ్ సినిమాల హవా ఎక్కువ వుండటం విశేషం. ఆ చిత్రాలు ఇవే.


1. ఖాకీ

తమిళ హీరో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్‌లు జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ మూవీ ఖాకి. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఆదిత్య ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాకు నిర్మాత‌లు. ఇటీవ‌ల విడుద‌లైన `ఖాకి` ఆడియోకు సూప‌ర్ రెస్పాన్స్ రావడంతో ఈ నెల 17న సినిమా విడుద‌ల చేస్తున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

 

2.‘గృహం’

సిద్ధార్థ్, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన హరర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘గృహం’ చిత్రం కూడా శుక్రవారం విడుదల కానుంది. వాస్తవానికి నవంబర్ 10న విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పటికీ ఈ చిత్రం నవంబర్ 17కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిలింద్ రావు దర్శకత్వం వహించిన ‘గృహం’ మూవీకి సిద్దార్థ్ స్క్రీన్ ప్లే, కథ సహకారం అందించడం విశేషం. ఇటీవల తమిళంలో అవల్ పేరుతో విడుదలైన ఈమూవీకి పాజిటివ్ టాక్ రావడంతో తెలుగులో ‘గృహం’ పేరుతో విడుదల చేస్తున్నారు.

3.ఆక్సిజన్

గోపీచంద్, రాశీ ఖన్నా, అనుఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిలన్లుగా నటిస్తున్న ‘ఆక్సిజన్’ మూవీ ఎట్టకేలకు విడుదల ముహూర్తాన్ని నవంబర్ 17గా ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ డేట్స్‌ను పలుసార్లు వాయిదా వేశారు చిత్ర నిర్మాతలు. ఇక వరుస ఫ్లాప్‌లు వెంటాడుతుండటంతో ఆక్సిజన్ ఈ హీరోకి ఉపశమనం ఇస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి ఏ.ఎం రత్నం కొడుకు జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

4.స్నేహమేరా జీవితం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విన్నర్ శివ‌బాలాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా న‌టించిన సినిమా "స్నేహ‌మేరా జీవితం". ఈ సినిమా త్వరలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైల‌ర్ ను దుబాయ్ లో జరిగిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో శుక్ర‌వారం విడుద‌ల చేశారు. వేవ్ రెజొనెంట్స్ ఈవెంట్స్ 10వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా జరిగిన కార్య‌క్రమంలో ఆ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ఓ దశలో అతడికి అవకాశాలే లేకుండా పోయాయి. ఐతే ఆ సమయంలోనే సొంతంగా నిర్మాతగా మారి ‘స్నేహమేరా జీవితం' అనే సినిమా మొదలుపెట్టాడు శివబాలాజీ. ఈ సినిమా కొన్ని నెలల కిందటే పూర్తయింది కూడా. కానీ ఇటు ప్రేక్షకుల్లో కానీ.. అటు ట్రేడ్ వర్గాల్లో ఎలాంటి స్పందనా కనిపించలేదు అప్పుడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఒక యధార్థ ఘటనని ఆధారంగా చేసుకుని ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ సినిమా. శివ‌బాలాజీ స‌ర‌స‌న యు.ఎస్‌కు చెందిన తెలుగు అమ్మాయి, క్లాసిక‌ల్ డ్యాన్సర్ సుష్మ యార్ల‌గ‌డ్డ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. బిగ్ బాస్ తో శివబాలాజీకి వచ్చిన ఫేంతో ఈ మూవీపై కొత్త అంచనాలు ఏర్పడ్డాయి.


5. లండన్ బాబులు

రక్షిత్, స్వాతి రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న చిత్రం లండ‌న్ బాబులు . త‌మిళ మూవీ ఆండ‌వ‌న్ క‌ట్టాలాయ్ మూవీకి రీమేక్‌గా లండన్ బాబులు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు బి. చిన్ని కృష్ణ. మారుతి టాకీస్ బేన‌ర్‌పై మారుతి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం.
 

6. దేవి శ్రీ ప్రసాద్

టైటిల్‌తో పాటు ట్రైలర్‌తోటూ ఆకట్టుకుంది దేవిశ్రీ ప్రసాద్ మూవీ. ఆర్‌.ఒ.క్రియేష‌న్స్, య‌శ్వంత్ మూవీస్ ప‌తాకాల‌పై సంయుక్తంగా భూపాల్, మ‌నోజ్ నంద‌న్‌,పూజా రామ‌చంద్ర‌న్, ధనరాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న చిత్రం `దేవిశ్రీ ప్ర‌సాద్‌`.
 

7. రారా

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రా రా’. శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకోవడంతో వచ్చే శుక్రవారం విడుదలకు రెడీగా ఉంది.
 

8. లవర్స్ క్లబ్

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణ‌లో, భరత్ అవ్వారి నిర్మాత‌గా ధృవ శేఖ‌ర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర‌, పావ‌ని ,ఆర్య‌న్‌. పూర్ణి లు జంట‌గా ల‌వ్‌స్టోరి గా
తెర‌కెక్కిన చిత్రం ల‌వ‌ర్స్‌క్ల‌బ్‌. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సంయుక్తంగా నిర్మించారు.
 

9. ప్రేమతో కార్తీక్

కొత్త కుర్రాడు కార్తీకేయ హీరోగా సిమ్రన్ కౌర్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘ప్రేమతో మీ కార్తీక్’. నూతన దర్శకుడు రిషి దర్శకత్వంలో తెరకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. వచ్చే శుక్రవారం థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు ఈ మూవీలో కీలకమైన రోల్‌లో నటిస్తున్నారు.

ఇలా వచ్చే శుక్రవారం ఒకటీ రెండూ కాకుండా ఏకంగా ఎనిమిది చిత్రాలు విడుదల కానుండటంతో ప్రేక్షకులకు పండగే అని చెప్పొచ్చు. అయితే ఈ ఎనిమిది చిత్రాల్లో కార్తీ ‘ఖాకి’, సిద్ధార్థ్ ‘గృహం’ చిత్రాలపై అంచనాలు ఉండగా.. స్వాతి ‘లండన్ బాబులు’, కొత్త కుర్రాడు ‘ప్రేమతో మీ కార్తీక్ కూడా పర్వాలేదనిపించేవిగా కనిపిస్తున్నయి. చూద్దాం వచ్చే శుక్రవారం ఎనిమిది చిత్రాల్లో ఏది హిట్టో.. ఏది ఫట్టో..

 

10. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవి డోరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, తులసి, జెమిని సురేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురాం రొయ్యూరుతో కలిసి ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో గోవర్ధన్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నుంచీ రిలీజ్ కు రెడీగా వున్న పలు కారణాలతో వాయిదాపడ్డ ఈ సినిమా ట్రైలర్, ఆడియో, టీజర్ లతో అటెన్షన్ క్రియేట్ చేసింది.

ఇంకా ఈ సినిమాలతో పాటు జస్టిస్ లీగ్, డేర్, ది లాస్ట్ హరర్ , బేబీ తదితర చిత్రాలు రిలీజై ప్రేక్షకులను ముంచెత్తనున్నాయి.

loader