ఇకనుంచి సింగిల్ స్క్రీన్ లో 5 షోలు సింగిల్ స్క్రీన్ పై ఐదు షోలకు అనుమతిచ్చిన తెలంగాణ సర్కారు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
సినీ పరిశ్రమ వర్గాలు చాలా కాలంగా అభ్యర్థిస్తున్న.. సింగిల్ స్క్రీన్స్ లో కూడా మల్టీప్లెక్స్ లా 5 షోస్.. ఇక నుంచి నిజం కానుంది. ఈ ఆలోచన ఎప్పటినుండో ఉంది. సినిమా ఫలితాన్ని తేల్చే వీకెండ్ సాధ్యమైంతవరకు పెద్ద మొత్తం లాగేయాలని స్టార్స్ ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో సినిమాకు పర్మిషన్ తీసుకుని రిలీజ్ నాడు మాత్రమే ఒక్క షో వేస్తున్నారు. కాని ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కేవలం ఒక్కరోజే కాదు అన్నివేళలా సింగిల్ స్క్రీన్స్ లో కూడా 5 షోస్ వేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఇది కచ్చితంగా స్టార్ సినిమాలకే కాదు చిన్న సినిమాలకు మంచి తరుణమని చెప్పాలి. ఇక 100 కోట్ల షేర్ ఒకటి రెండు అనుకుంటున్న ఈ క్రమంలో ఇలా 5 షోస్ వేస్తే కచ్చితంగా మంచి టాక్ తెచ్చుకున్న ప్రతి స్టార్ సినిమా 100 కోట్ల కలక్షన్స్ సాధించే అవకాశం ఉంది. తెలంగాణాలో సింగిల్ స్క్రీన్స్ లో కూడా 5 షోలు వేసుకోవచ్చని ప్రభుత్వం జీవో పాస్ చేసింది.
ఇక ఏపిలో కూడా ఈ జీవో అమలు చేయించడం పెద్ద విషయం కాకపోవచ్చు. మరి ఈ 5 షోస్ తో సినిమాల ఫలితాలు కచ్చితంగా మెరుగు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. సినిమా పరిశ్రమ బాగుండాలని తెలంగాణా, ఏపి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సహకారం అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఇది కచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పొచ్చు.
