తేజస్వి చేసిన ఆ పని బిగ్ బాస్ కు తలనొప్పిగా మారింది!

tejaswi's shocking behaviour puts bigg boss in trouble
Highlights

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నవారు కాస్త బయటకు వెళ్లిపోతుండడంతో షో పరిస్థితి ఏంటనేది అర్ధం కాకుండా తయారైందని లబోదిబోమంటున్నారు. పోనీ కౌశల్ ను బయటకు పంపాలని అనుకున్నా.. అప్పుడు షోపై నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది


బిగ్ బాస్ షో లో ఎవరైతే ఎక్కువ కాంట్రవర్సీలు చేస్తారో వారే ఫైనల్ వరకు ఉంటారని ఆ కోణంలోనే గేమ్ ఆడడం మొదలుపెట్టింది తేజస్వి. హౌస్ లో కొందరితో స్నేహంగా ఉంటూ.. మిగిలిన వారిపై మాటల దాడి చేసేది. ఈ క్రమంలో ఆమె కారణంగా చాలా మంది హౌస్ మేట్స్ బాధపడ్డారు. కౌశల్ పై ఆమె వేసిన నిందల కారణంగా ఆమెకు పబ్లిక్ నుండి నెగెటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి. కౌశల్ అభిమానులు అందరూ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

వారి ప్రభావం షోపై ఎంతగా ఉందంటే.. చివరకి తేజస్వి హౌస్ నుండి బయటకు వచ్చేసింది. తిరిగి తేజస్విని హౌస్ లోకి పంపించాలని బిగ్ బాస్ వేసిన ప్లాన్ ను కూడా వర్కవుట్ కాకుండా చేసింది కౌశల్ ఆర్మీ. కౌశల్ పై హౌస్ లో ఉన్నవారు ఏమైనా కామెంట్ చేస్తున్నా వారిని ప్రశ్నించకపోతే ఆఖరికి హోస్ట్ నానిని కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. కౌశల్ తో ఎవరైనా పెట్టుకుంటే ఇక వారు హౌస్ నుండి బయటకు వచ్చేలా చేస్తున్నారు ఈ అభిమానులు. దీంతో బిగ్ బాస్ షో అనుకున్న విధంగా నడవడం లేదని నిర్వాహకులు భావిస్తున్నారు.

స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్నవారు కాస్త బయటకు వెళ్లిపోతుండడంతో షో పరిస్థితి ఏంటనేది అర్ధం కాకుండా తయారైందని లబోదిబోమంటున్నారు. పోనీ కౌశల్ ను బయటకు పంపాలని అనుకున్నా.. అప్పుడు షోపై నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. మొత్తానికి తేజస్వి చేసిన పని కారణంగా అటు బిగ్ బాస్ ఇటు నాని ఇద్దరూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అంటున్నారు.  

loader