దివంగత నటి శ్రీదేవి మరణంతో బోని కపూర్ కు పరామర్శలు కొనసాగుతున్నాయి. బోని కపూర్ కుటుంబం అనిల్ అంబానీ కుటుంబంతో కూడా సన్నిహితంగా ఉంటుంది.శ్రీదేవి మృతి తరువాత బోని కపూర్ దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాగా శ్రీదేవి ఉన్నపుడు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీతో సన్నిహితంగా మెలిగేది. వీరిద్దరూ కలసి పార్టీలకు, వేడుకలకు హాజరయ్యే వారు. కాగా టీనా అంబానీ చివరగా శ్రీదేవితో కలసి దిగిన ఫొటోకి వెండి ప్రేమ్ కట్టించి బోనికపూర్ కు జ్ఞాపికగా అందజేశారు.

 

ఫిబ్రవరి 11 న టీనా అంబానీ తన 61 వ జన్మ దిన వేడుకల్ని జరుపుకున్నారు. ఈ వేడుకకు బోనికపూర్, శ్రీదేవి హాజరయ్యారు. ఈ పార్టీలో బోనికపూర్, శ్రీదేవి కలసి టీనా అంబానీతో ఫోటో దిగారు. ఆ ఫోటోకు టీనా అంబానీ వెండి ప్రేమ్ కట్టించి ఇటీవల బోనికపూర్ కు అందజేశారు.

 

టీనా ఇచ్చిన ఫోటో చూడగానే ఫోటో చూసిన వెంటనే బోనికపూర్ తీవ్ర భావోద్వేగంతో ఏడ్చేశారు. శ్రీదేవి మరణంతో ఇప్పటికే ఆయన బోలెడు దుఃఖంతో ఉన్నారు. శ్రీదేవి చిరునవ్వుతో ఉన్న ఫొటో చూసే సరికి ఆయన భావోద్వేగం ఆపుకోలేకపోయారట.

 

శ్రీదేవి స్నేహం టీనా అంబానీ, శ్రీదేవి సన్నిహితంగా మెలిగారు. శ్రీదేవితో తనకు ఇదే చివరి ఫోటో అవుతుందని తాను ఊహించలేదని టీనా అంబానీ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు.