Asianet News TeluguAsianet News Telugu

puneeth raj kumar Death: కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. పునీత్ మరణంపై చంద్రబాబు సంతాపం

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం పట్ల టీడీపీ (tdp) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటని చంద్రబాబు అన్నారు

tdp chief chandrababu naidu Condolence message for puneeth rajkumar Death
Author
Amaravati, First Published Oct 29, 2021, 3:51 PM IST

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం పట్ల టీడీపీ (tdp) అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా పునీత్ కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. 

 

 

అంతకుముందు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌ (puneeth raj kumar) మరణంపై తెలుగు సినీ నటుడు, జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు (kannada film industry)  తీరని లోటని పవన్ అభివర్ణించారు. అటు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) సైతం పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం పట్ల షాక్‌కు గురయ్యారు. కన్నడ పరిశ్రమ ఒకస్టార్ హీరోను కోల్పోయిందని ఆయన అన్నారు. 

పునీత్ మరణం రాజ్ కుమార్ కుటుంబానికి తీరని లోటు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చిరు అన్నారు. పునీత్ తనకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారేనని మెగాస్టార్ వెల్లడించారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా తనను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. పునీత్ మరణవార్త తెలియగానే తన నోట మాట కూడా రావడం లేదని చిరు ఆవేదన వ్యక్తం చేశారు .

Also Read:Puneeth Rajkumar Death: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత..

కాగా.. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా పునీత్ రాజ్‌కుమార్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన బెంగుళూరులో విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు. ఆయన మరణంతో కర్ణాటక రాష్ట్రం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. థియేటర్లన్ని మూసివేశారు. కన్నడ సీఎం బసవరాజ్ బొమ్మై సైతం విక్రమ్‌ ఆసుపత్రికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

కన్నడ కంఠీరావ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. కన్నడ పవర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఆయన 1975మార్చి 17న జన్మించారు. నటుడిగానే కాదు ప్లేబ్యాక్‌ సింగర్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా ఉన్నారు 1976లో `ప్రేమదా కనికే` చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. దాదాపు పదమూడు సినిమాల్లో బాలనటుడిగా మెప్పించారు. `అప్పు` సినిమాతో హీరోగా మారారు. `ఇడియట్‌` చిత్రానికి రీమేక్‌. పూరీ దర్శకత్వం వహించడం విశేషం.

హీరోగా దాదాపు 29 సినిమాల్లో నటించారు. `అభి`, `వీర కన్నడిగ`, `మౌర్య`, `ఆకాష్‌`, `నమ్మ బసవ`, `అజయ్‌`, `అరసు`, `మిలన`, `బిందాస్‌`, `రాజ్‌`, `పృథ్వీ`, `జాకీ`, `హంగామా`, `అన్న బాండ్‌`, `పవర్‌`, `రానా విక్రమ`, `చక్రవ్యూహ`,`దొడ్మనె హగ్డ్`, `రాజకుమార`, `అంజని పుత్ర` చిత్రాలతో పవర్‌ స్టార్‌గా ఎదిగారు. `చివరిగా ఆయన `యువరత్న` చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం `జేమ్స్`, `ద్విత్వ` చిత్రాల్లో నటిస్తున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో కన్నడ నాట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు తీవ్ర విషాదాన్ని తెలియజేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios