కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూశారు. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన బెంగుళూరులో విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth rajkumar) కన్నుమూశారు. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన బెంగుళూరులో విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని విక్రమ్ ఆసుపత్రి వైద్యులు, కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై ప్రకటించారు. కానీ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణించినట్టు సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెడుతూ సంతాపం తెలియజేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు. 

అయితే జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా ఆయనకు ఒక్కసారిగా చాతిలో నొప్పి స్టార్ట్ అయ్యింది. ఉదయం పదకొండు గంటల సమయంలో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రకటనకు ముందే విక్రమ్‌ ఆసుపత్రికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు రాష్ట్రం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. థియేటర్లన్ని మూసివేశారు. కన్నడ సీఎం సైతం విక్రమ్‌ ఆసుపత్రికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం మరోవైపు కన్నడ సూపర్‌స్టార్‌ యష్‌, పునీత్‌ బ్రదర్‌, స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ చేరుకుని పరామర్శించారు. 

Also Read: Puneeth Raj Kumar: కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు గుండెపోటు.. పరిస్ధితి విషమం

కన్నడ కంఠీరావ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. కన్నడ పవర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్న ఆయన 1975మార్చి 17న జన్మించారు. నటుడిగానే కాదు ప్లేబ్యాక్‌ సింగర్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా ఉన్నారు 1976లో `ప్రేమదా కనికే` చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. దాదాపు పదమూడు సినిమాల్లో బాలనటుడిగా మెప్పించారు. `అప్పు` సినిమాతో హీరోగా మారారు. `ఇడియట్‌` చిత్రానికి రీమేక్‌. పూరీ దర్శకత్వం వహించడం విశేషం.

హీరోగా దాదాపు 29 సినిమాల్లో నటించారు. `అభి`, `వీర కన్నడిగ`, `మౌర్య`, `ఆకాష్‌`, `నమ్మ బసవ`, `అజయ్‌`, `అరసు`, `మిలన`, `బిందాస్‌`, `రాజ్‌`, `పృథ్వీ`, `జాకీ`, `హంగామా`, `అన్న బాండ్‌`, `పవర్‌`, `రానా విక్రమ`, `చక్రవ్యూహ`,`దొడ్మనె హగ్డ్`, `రాజకుమార`, `అంజని పుత్ర` చిత్రాలతో పవర్‌ స్టార్‌గా ఎదిగారు. `చివరిగా ఆయన `యువరత్న` చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం `జేమ్స్`, `ద్విత్వ` చిత్రాల్లో నటిస్తున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో కన్నడ నాట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు తీవ్ర విషాదాన్ని తెలియజేస్తున్నారు. 

పునీత్ రాజ్ కుమార్ మృతిని అధికారికంగా ప్రకటించడానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్నడ పవర్ స్టార్ గా ఆయన ప్రసిద్ధి వహించారు. కర్ణాటక అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. విక్రమ్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స చేసినా ఆయన ప్రాణాలు దక్కలేదు. కర్ణాటకలో సినిమా థియేటర్లను మూసేశారు