ఫస్టులుక్ లో అదరగొట్టేస్తోన్న విజయ్ దేవరకొండ

ఫస్టులుక్ లో అదరగొట్టేస్తోన్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తాజాగా చిత్రంగా 'టాక్సీవాలా' రూపొందుతోంది. రాహుల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను విడుదల చేశారు. టాక్సీ డ్రైవర్ గా టాక్సీకి ఆనుకుని చాలా రఫ్ లుక్ తో ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. న్యూ హెయిర్ స్టైల్ తో ఈ పోస్టర్ లో విజయ్ కొత్తగా అనిపిస్తున్నాడు. ఇది సైకలాజికల్ టచ్ వున్న హారర్ జోనర్ అని తెలుస్తోంది.

 ఈ సినిమాలో హీరోకి ఒక దెయ్యంతో స్నేహం ఏర్పడుతుందట. ఆయనతో కలిసి ఆ దెయ్యం కార్లోనే తిరుగుతూ వుంటుందని చెబుతున్నారు. అందుకు గల కారణం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనేది సమాచారం. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండటం వలన భారీ అంచనాలు వున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos