మళ్లీ ముగ్గురు కలిశారు... ఎందుకో తెలుసా..?

Tarak mahesh and charan at private party
Highlights

మళ్లీ ముగ్గురు కలిశారు... ఎందుకో తెలుసా..?

స్టార్ హీరోలు ఇద్దరు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే చూడటానికి రెండు కళ్లు చాలవేమో అన్నంత ఆనందంగా అనిపిస్తుంది. అలాంటిది ఏకంగా ముగ్గురు  ఒకేచోట కలిసి చిరునవ్వులు చిందిస్తే ఆ ఫ్రేమ్ అదుర్స్ అనాల్సిందే. ఓ మిడ్ నైట్ పార్టీ కోసం టాలీవుడ్ లో స్టార్ హీరోలు ముగ్గురు ఒకేచోట కలిసి సందడి చేశారు. సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇటీవల ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ వేడుకకు తారక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. అనంతరం రామ్ చరణ్ కూడా వీరికి జత కలిశారు. ముగ్గురు కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అంతేకాదండోయ్ మన హీరోలతో పాటు వాళ్ల భార్యల మధ్య కూడా మంచి సన్నిహిత్యం ఉంది.

ఏప్రిల్ తొలివారంలో కలిసిన ఈ ముగ్గురు టాప్ హీరోలు.. ఇదే నెలలో మరోసారి కలిశారు. చెర్రీ, తారక్, మహేశ్ బాబు కలిసిన ఫొటోను రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గతంలో భరత్ అనే నేను బహిరంగ సభ కోసం కలిసిన వీరు ముగ్గురూ.. ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్న సమస్యల గురించి కలిశారు.

loader