ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ప్రభాస్, రవితేజలు హీరోలు అయ్యేవాళ్ల?: తమ్మారెడ్డి

ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ప్రభాస్, రవితేజలు హీరోలు అయ్యేవాళ్ల?: తమ్మారెడ్డి

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది.. మీకు కూడా క్యాస్టింగ్ ఫీలింగ్ ఎక్కువనే కామెంట్స్ చేస్తున్నారు అన్న ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు తమ్మారెడ్డి. ‘ఈ మధ్య నా పేరు చివరన నా కులాన్ని చేర్చి కామెంట్ చేస్తున్నారు. వాళ్లు అనుకుంటే అనుకోనీయండి.. ఎవరి ఇష్టం వాళ్లది. వాళ్లు అలా అనుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. మనది స్వతంత్ర్య భారతదేశం ఏమైనా మాట్లాడొచ్చు... కాదనడానికి మనం ఎవరం. నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందో లేదో నాతో పాటు పనిచేసిన నటీనటులను అడిగితే సరిపోతుంది. వాళ్లంతా బతికే ఉన్నారు. చచ్చిపోలేదు. నాకు ఇండస్ట్రీతో 47 ఏళ్ల అనుబంధం ఉంది. నా దగ్గర నుండి వచ్చిన నటులు ఎవరూ నా కులం వారు కాదు. ఒక్క శ్రీకాంత్ తప్ప. వాళ్లు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎవర్నీ మీ కులం ఏంటి అని అడగలేదు అంటే ఆ సినిమాను అతడి కులం కోసమే చూశారా? మీరు చెప్పిందే నిజం అయితే ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం ఆడకూడదు కదా.. ఆయన కులం కమ్మ కాదు కదా.. ఇవన్నీ ఒట్టిమాటలు, ప్రభాస్ హీరో ఎందుకు అయ్యారు? కృష్ణం రాజు ఎందుకు హీరో అయ్యారు? అప్పట్లో కాంతారావు, రమణమూర్తి, హరినాథరాజు వీళ్లంతా హీరోలెలా అయ్యారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos