యంగ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్!

tamil director atlee to direct ntr
Highlights

'జై లవకుశ' చిత్రంతో సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా

'జై లవకుశ' చిత్రంతో సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా పూర్తయిన తరువాత రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నాడు. తాజాగా ఈ హీరో మరో సినిమా అంగీకరించినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీఅనువాద చిత్రాల ద్వారా తెలుగువారికి పరిచయమే..

'రాజారాణి','మెర్సల్' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా అట్లీ తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాడు. తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా ఉంటుందని అని కూడా వెల్లడించాడు. ఈ క్రమంలో బన్నీ పేరు వినిపించినప్పటికీ తారక్ తో అట్లీ సినిమా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చిత్రంతో అట్లీకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి!

loader