మరోసారి ఐటమ్ గర్ల్ గా వస్తోన్న తమన్నా జై లవ కుశలో స్పెషల్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ మిల్కీ బ్యూటీ రాకతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్

బాహుబలి చిత్రం తరవాత తమన్నాకు ఆఫర్లు వెల్లువలా వస్తాయని భావించింది. కానీ బాహుబలి తర్వాత తమన్నా కెరీర్ గొప్పగా మలుపు తిరగనే లేదు. ఆమె కెరీర్ దాదాపు అయిపొయింది అనుకున్న టైం లో ఇప్పుడు రెండు వరస సినిమాలు ఆమె తన ఖాతాలో వేసుకుంది.

ఒకటి కళ్యాణ్ రామ్ తో స్వయంగా హీరోయిన్ గా ఒక భారీ ప్రాజెక్ట్ కి సంతకం పెట్టింది తమన్నా మరొక పక్క ఎన్టీఆర్ హీరోగా వస్తున్న జై లవ కుశ చిత్రం లో ఐటెం సాంగ్ చేస్తోంది. అల్లుడు శ్రీను తరవాత తమన్నా చేస్తున్న స్పెషల్ ఐటెం సాంగ్ ఇదే . జై లవ కుశ లో స్పెషల్ సాంగ్ అనగానే ఆమె ఫుల్ హ్యాపీగా ఉంది కానీ నందమూరి ఫాన్స్ మాత్రం అస్సలు సంతోషంగా లేరు.

చాలా సంవత్సరాల నుంచీ తమన్నా మీద ఐరన్ లెగ్ అనే అపవాదు ఉంది. బాహుబలి పక్కన పెడితే ఆమె కి ఈ మధ్య కాలం లో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ లు ఏమీ లేవు. ఊపిరి లాంటి బాగున్న సినిమాలు కూడా రెవెన్యూ విషయం లో వెనకపడ్డాయి అంటే తమన్నా లెగ్ మాత్రమే అని నమ్మే వాళ్ళు ఉన్నారు.

ఇప్పుడు ఏకంగా నందమూరి హీరోలు ఇద్దరితో ఆమె రొమాన్స్ చెయ్యబోతోంది. ముఖ్యంగా నందమూరి ఫాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న జై లవకుశ చిత్రానికి ఆమె లెగ్ పెడితే ఏదైనా జరగకూడనిది జరుగుతుందేమో అని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM