పెళ్లి పుకార్లపై ఘాటు రిప్లై ఇచ్చిన తమన్నా

Tamannah Quashes Rumours
Highlights

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ తమన్నా పెళ్లి చేసుకోబోతోదంటూ వస్తున్న వార్తలు తెలిసిందే. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిందని, ఆమె ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. 

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ తమన్నా పెళ్లి చేసుకోబోతోదంటూ వస్తున్న వార్తలు తెలిసిందే. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిందని, ఆమె ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో కూడా తమన్నాపై ఇటువంటి వార్తలు వ్యాపించడం, ఆ తర్వాత తమన్నా ఖండించడం వంటివి జరిగాయి. తాజాగా మరోసారి తమన్నా.. తన పెళ్లి వార్తలను ఖండిస్తూ ట్వీట్ చేసింది. అయితే ఈసారి కాస్త ఘాటుగానే స్పందించింది తమన్నా.
 
ట్వీట్టర్ తమన్నా ఏం తెలిపిందంటే.. ‘‘ఒకప్పుడు యాక్టర్‌తో నా పెళ్లి అన్నారు. మరోసారి క్రికెటర్‌తో అన్నారు. ఇప్పుడేమో డాక్టర్‌తో అంటూ రాస్తున్నారు. ఇలాంటి వార్తలను వింటుంటే నేను భర్త కోసం షాపింగ్ చేస్తున్నానేమో అనే ఫీలింగ్ కలుగుతోంది. నాకు ప్రేమ అనే భావన ఇష్టమే కానీ, పర్సనల్ లైఫ్‌ని టార్గెట్ చేస్తూ ఇలాంటి రూమర్స్ పుట్టించడమే సరికాదు. ప్రస్తుతం నేను సింగిల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకోసం వరుడిని వెతికే పనిలో లేరు. ప్రస్తుతం నేను సినిమాలకు సంబంధించిన వ్యవహారాలతో రొమాన్స్ చేస్తున్నాను. నా పనిలో నేను బిజీగా ఉంటే.. ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటాను. సో.. అప్పటి వరకు మీ ఊహలతో నాకు పెళ్లి చేయడం మానుకోండి..’’ అంటూ వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. 

 

loader