తమన్నాకు పెళ్లి.. పెళ్లికొడుకు ఎవరంటే..

tamannah marriage confirmed
Highlights

రెండు కుటుంబాల పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చే ముహూర్తం చూసుకుని ముందుగా ఎంగేజ్మెంట్ నిర్వహించి ఆ తరువాత పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నారు. పెళ్లైన తరువాత తమన్నా అమెరికాలోనే సెటిల్ అవుతుందట.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావనే అపోహ ఉండనే ఉంది. ఇప్పటి హీరోయిన్లు దీనికి అతీతంగా పెళ్లి అయినా.. సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. కానీ అవకాశాలు రావని చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. మూడు పదుల వయసు దాటుతున్నా పెళ్లి ఆలోచనలు మాత్రం దగ్గరకు రానివ్వరు. ఈ లిస్ట్ లో తమన్నా కూడా ఉంది.

అయితే ఇప్పుడు మాత్రం అమ్మడు పెళ్లికి సిద్ధమవుతుందని సమాచారం. పెళ్లికొడుకు కూడా రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. త్వరలోనే నిశ్చితార్ధం జరిపించబోతున్నారని టాక్. పెళ్ళికొడుకు అమెరికాలో డాక్టర్ గా పని చేస్తున్నాడట. అతడి కుటుంబం మొత్తం కూడా అక్కడే సెటిల్ అయిందని సమాచారం. వారికి చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయట. రెండు కుటుంబాల పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చే ముహూర్తం చూసుకుని ముందుగా ఎంగేజ్మెంట్ నిర్వహించి ఆ తరువాత పెళ్లి జరిపించాలని ప్లాన్ చేస్తున్నారు.

పెళ్లైన తరువాత తమన్నా అమెరికాలోనే సెటిల్ అవుతుందట. ఆ కారణంగానే అమ్మడు సినిమాలు కూడా పెద్దగా అంగీకరించడం లేదని చెబుతున్నారు. మరి ఈ విషయంపై తమన్నా ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి!

loader