బాలీవుడ్ టాలీవుడ్ లో ప్రముఖ సీనియర్ నటి ట‌బూ ఇప్ప‌టికి వివాహ‌నికి దూరంగా ఉంది ఈ ముద్దు గుమ్మ పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి హిరో అజ‌య్ దేవ‌గ‌ణ్ నే కార‌ణ‌మ‌ని చెబుతున్న ట‌బూ

ప్రముఖ సీనియర్ నటి టబూ తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాతికేళ్ళుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ఈ నటి మాత్రం వివాహ ఘట్టానికి ఆమడ దూరంనే ఉంది. ఇలా ఉండటానికి గల కారణాన్ని ఆమె వెల్లడించింది.

ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ. తాను పెళ్లి చేసుకోక పోవడానికి కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవగణే ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది. అజయ్ తనకు పాతికేళ్లుగా తెలుసని. ఒకప్పుడు తన కజిన్ సమీర్ ఇంటిపక్కనే అజయ్ ఉండేవాడని. అప్పుడు తామంతా మంచి స్నేహితులుగా ఉండేవారమని తెలిపింది

సమీర్‌తో కలసి అజయ్ తనను ఓ కంట కనిపెడుతుండేవాడని. తాను ఎక్కడకు వెళ్లినా ఫాలో అయ్యేవాడని. వేరే అబ్బాయిలు ఎవరైనా తనవైపు చూసినా, మాట్లాడినా కొట్టేవాడని తెలిపింది. తనకు పెళ్లి కాకపోవడానికి ముమ్మాటికీ అజయే కారణమని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికైనా ఆయన గుర్తించాలని తెలిపింది.

 హీరోల్లో అజయ్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని. తనను బాగా చూసుకుంటాడని చెప్పింది. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని తెలిపింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ సినిమా 'గోల్ మాల్ ఎగైన్'లో టబూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరి ఈ చిత్రం షూటింగ్ సమయంలోనైనా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందేమో వేచి చూడాలి.