శ్రీరెడ్డి ఆరోపణల సంగతేంటి: స్టార్ హీరో తండ్రి

t rajendar suggested to respond on sri reddy issue
Highlights

శ్రీరెడ్డి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమాధానం చెప్పి సమస్యను ఇంతటితో ముగిస్తే మంచిది. సినిమా ఇండస్ట్రీలో మంచి, చెడు రెండూ ఉంటాయి. అయితే వాటిని సమస్యలుగా వదిలేయకూడదు. కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో కామన్.. కానీ మా కాలంలో మాత్రం ఇలా లేదు. 

తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వారిపై ఆరోపణలు చేస్తోన్న నటి శ్రీరెడ్డి ఇప్పటివరకు శ్రీలీక్స్ అంటూ టాలీవుడ్ పై పడింది. తాజాగా కోలివుడ్ లీక్స్ అంటూ తమిళ హీరోలను, దర్శకులను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అగ్ర దర్శకుడు మురుగదాస్, అలానే లారెన్స్ లు తనకు అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేశారంటూ పోస్ట్ లు పెట్టింది. 

ఈరోజు నటుడు విశాల్ తనకు హాని కలిగించే అవకాశం ఉందని మరో పోస్ట్ పెట్టింది. అయితే ఈ విషయాలపై సదరు హీరో, దర్శకులు స్పందించలేదు. కానీ ఈ విషయాలు తమిళనాట వివాదాస్పదమవుతునే ఉన్నాయి. తాజాగా తమిళ హీరో శింబు తండ్రి దర్శకుడు, నటుడు, రాజకీయ నేత అయిన టి.రాజేందర్ ఈ విషయంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..

''శ్రీరెడ్డి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమాధానం చెప్పి సమస్యను ఇంతటితో ముగిస్తే మంచిది. సినిమా ఇండస్ట్రీలో మంచి, చెడు రెండూ ఉంటాయి. అయితే వాటిని సమస్యలుగా వదిలేయకూడదు. కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో కామన్.. కానీ మా కాలంలో మాత్రం ఇలా లేదు. నేను నటించిన, డైరెక్ట్ చేసిన సినిమాలలో హీరోయిన్ ను టచ్ కూడా చేయలేదు. ప్రస్తుతం సినిమా పరిస్థితులు మారిపోయాయి. ఇండస్ట్రీలో ఇటువంటి బహిరంగ ఆరోపణలు చేయడం హెల్తీ కాదు'' అని తెలిపారు. 

loader