సైరా నరసింహారెడ్డి చిత్రం మరికొద్ది రోజుల్లో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో మెగా అభిమానుల్లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సైరా చిత్ర స్పెషల్ షోలు చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. 

టికెట్ ధర పట్టించుకోకుండా ఎంతైనా ఖర్చు చేసేస్తున్నారు. ఇప్పటికే బెంగుళూరులో సైరా చిత్ర స్పెషల్ షోకి సంబందించిన టికెట్లు కొన్ని గంటల్లోనే క్లోజ్ అయ్యాయి.తాజాగా సైరా చిత్ర టికెట్లకు సబంధించి పంజాబ్ లోని ఓ ఊరిలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. 

ఫగ్వారా అనే పట్టణంలో సైరా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన 15 నిమిషాల్లోనే టికెట్స్ మొత్తం అయిపోయాయి. పంజాబ్ లో సైరాసి చిత్రానికి ఇలాంటి క్రేజ్ ఉండడంపై ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది తెలుగు ఆడియన్స్ పనే. 

ఫగ్వారా అనే పట్టణంలో ఎల్పీయు యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు అధికసంఖ్యలో ఉన్నారు. సైరా లాంటి ప్రతిష్టాత్మక చిత్రం రిలీజవుతుంటే వదులుతారా.. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా 15 నిమిషాల్లోనే థియేటర్స్ లోని టికెట్స్ మొత్తం ఖాళీ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆ థియేటర్ హౌస్ ఫుల్ అయిపోయింది. 

కొన్ని రోజుల క్రితం జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇంతే మరి. 

సైరాలో ఆ పదాలు మ్యూట్ చేసిన సెన్సార్.. సినిమా నిడివి ఎంతంటే!

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!