'సై రా' సెట్స్ ను కూల్చేశారు.. షాక్ లో చిత్ర యూనిట్!

Sye Raa Shooting Stopped, Officials Demolish Sets
Highlights

 శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ సెట్స్ లో రంగస్థలం షూటింగ్ పూర్తయిన తరువాత సైరా సినిమాకు కావాల్సిన సెట్స్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో వారి వద్ద పర్మిషన్ తీసుకొని పని మొదలుపెట్టాలి. కానీ చిత్రబృందం ఆ విధంగా చేయకపోవడంతో ఆగ్రహించిన అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన సెట్స్ ను కూల్చేశారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరిగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం భారీ సెట్స్ ను నిర్మించారు. కానీ ఇప్పుడు ఆ సెట్స్ ను రెవెన్యూ అధికారులు కూల్చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా షూటింగ్ జరిగిన సెట్స్ లోనే 'సై రా' షూటింగ్ కూడా జరుగుతోంది.

శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ సెట్స్ లో రంగస్థలం షూటింగ్ పూర్తయిన తరువాత సైరా సినిమాకు కావాల్సిన సెట్స్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో వారి వద్ద పర్మిషన్ తీసుకొని పని మొదలుపెట్టాలి. కానీ చిత్రబృందం ఆ విధంగా చేయకపోవడంతో ఆగ్రహించిన అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన సెట్స్ ను కూల్చేశారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినా చిత్రబృందం స్పందించకపోవడంతో సెట్స్ ను నాశనం చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ముందుగానే అనుమతులు కోరి ఉంటే కచ్చితంగా పర్మిషన్ దొరికి ఉండేదని కానీ అనుమతి తీసుకోకుండా చిత్రబృందం తప్పు చేసిందని అన్నారు. అనుమతి లేకుండా సెట్స్ వేసి ఆ తరువాత ఆ భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతోనే ఈ విధంగా చేసి ఉంటారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు.   

loader