సైరా నరసింహారెడ్డిలో జగపతి బాబు కీలకపాత్ర నరసింహారెడ్డికి మిత్రుడిగా వుంటూ సడెన్ గా వెన్నుపోటు పొడిచే పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ లో జగపతిబాబు పాత్ర నిజస్వరూం తెలిపే సీన్
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సక్సెస్ ఇచ్చిన జోష్ తో మరో భారీ ప్రాజెక్టు చేయాలని పక్కా స్క్రిప్ట్ తో.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమాను ప్లాన్ చేశారు. స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి దర్శకత్వలో రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ దగ్గర నుంచీ నయనతార వరకూ తారాగణం టాప్ లెవెల్ నటీనటులతో కూడి ఉంది.
సైరా మూవీలో మ్యాన్లీ హీరో జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. లెజెండ్ సినిమాతో విలన్ గా మారి ఒక రేంజ్ కు ఎదిగిన జగపతి బాబు ఇప్పుడు సైరా లాంటి బాలీవుడ్ రేంజ్ సినిమాలో ముఖ్యమైన పాత్రకి సెలక్ట్ అవ్వడం విశేషం.
అయన క్యారెక్టర్ ఏంటి అనేది కూడా ఇప్పుడు ట్విట్టర్ లో పెద్ద డిస్కషన్ గా మారింది. నరసింహా రెడ్డి కి చిన్నతనం నుంచీ వెనకాలే ఉంటూ , మిత్రుడుగా ఈ క్యారెక్టర్ సినిమాలో కనిపిస్తుంది అంటున్నారు. అయితే ఇంటర్వెల్ టైం లో జగపతి బాబు నెగెటివ్ షేడ్ బయటకి రాబోతుందట.
ఆంగ్లేయులకు ఉప్పందించి వెన్నుపోటు పొడిచే పాత్రలో ఆయన నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించి మెప్పిస్తొన్న జగపతిబాబు, ఈ పాత్రకి పూర్తి న్యాయం చేస్తాడని భావించి ఎంపిక చేసుకున్నారట. ఇంటర్వెల్ బ్యాంగ్ పడే ముందు ఈ సీన్ వుంటుందని అనుకుంటున్నారు.
