సైరాకు నయన్ కూడా హ్యాండిచ్చిందా.. అనుష్క వైపు చూపులు

First Published 27, Dec 2017, 3:28 PM IST
sye raa narasimhareddy becoming nightmare for chiranjeevi
Highlights
  • మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సైరా నరసింహారెడ్డి
  • ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్
  • సురెందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరాలో నయన్
  • తాజాగా డేట్స్ అడిగితే దర్శకుడి ఫోన్ కు నయన్ స్పందించలేదని టాక్

తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి  ఖైదీ నంబర్ 150తో బాక్స్ బద్దలు కొట్టిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెంబర్ 150 సక్సెస్ తర్వాత.. తదుపరి చిత్రానికి మాత్రం చిరంజీవి విభిన్న కథాంశాన్నే ఎన్నుకున్నారు. 'సైరా' అంటూ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్దమైపోయారు. తీరా షూటింగ్ మొదలయ్యాక... చిరంజీవికి ఎక్కడో తేడా కొడుతుందోన్న అనుమానం కలుగుతోందట. సైరా షూటింగ్ అనుకున్న షెడ్యూల్ కు ప్రారంభం కాకున్నా... దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షెడ్యూల్ వేగంగానే పూర్తి చేశారు. అయితే తొలి షెడ్యూల్ రషెస్ చూశాక.. చిరంజీవి కాస్త అసంతృప్తికి లోనయ్యారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. సినిమాను స్టైలిష్ గానూ, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతోనూ తెరకెక్కించడంలో ఆయనకు మంచి పేరే ఉంది. అలాంటిది.. సురేందర్ రెడ్డిపై ఎందుకు చిరు అసంతృప్తిగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకానొక దశలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ను సంప్రదిద్దామా? అన్న ఆలోచన కూడా చేశారట చిరంజీవి. నిజానిజాలేంటో తెలియదు కానీ సురేందర్ రెడ్డిని అవమానపరిచేలా ఈ ప్రచారం జరుగుతోంది.

 

అసలు సైరా సినిమాకు మొదటి నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. ఏది అనుకున్నట్లుగా జరగట్లేదు. షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దానికి తోడు సెట్స్ మీదకు వెళ్తున్న సమయంలోనే కెమెరామెన్ రవివర్మన్ తప్పుకున్నారు. దీంతో రత్నవేలు వచ్చి చేరారు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

 

ఇలా సైరాకు టెక్నీషియన్స్ ఝలక్ ఇవ్వగా.. హీరోయిన్ నయన్ కూడా షాక్ ఇస్తుందా? అన్న భయం పట్టుకుంది. సినిమాకు సంబంధించి నయనతార డేట్స్ ఇంకా ఖరారు కాలేదట. ఇదే విషయమై కనుక్కునేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెకు ఫోన్ చేసినా.. అటు నుంచి ఎటువంటి స్పందన లేదట. దీంతో నయనతార 'సైరా'లో ఉంటుందా లేదా అన్న చర్చ జోరందుకుంది. ఒకవేళ నయన్ హ్యాండిస్తే అనుష్కను ఆ స్థానంలో తీసుకోవాలని కూడా చర్చ జరుగుతోందట.

 

loader