సైరా సినిమా ప్లానింగ్ పై బైటపడుతున్న డొల్లతనం

First Published 28, Nov 2017, 1:18 PM IST
sye raa narasimha reddy planning problems
Highlights
  • మెగాస్టార్ చిరు సైరా చిత్రం ప్లానింగ్ లోపాలపై గుసగుసలు
  • ఇప్పటికే తప్పుకున్న సంగీత దర్శకుడు రెహ్మాన్, సినిమాటోగ్రఫర్ రవి వర్మన్
  • కాస్ట్ అండ్ క్రూ విషయంలో మరిన్ని మార్పులకు అవకాశాలంటూ చర్చ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఖైదీ నెం.150 ఇట్టిన సక్సెస్ తో మాంచి జోష్ లో వున్న మెగా కాంపౌండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చిరంజీవి కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా.... బాహుబలి తరహాలో సైరాను రూపొందించాలని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది.

 

అయితే ‘సైరా’ చిత్రం కోసం పనిచేసే టీమ్ ప్లానింగ్ లో లోపాలు తలెత్తుతున్న నేపథ్యంలో టీమ్ ప్లానింగ్ లో వైఫల్యం చెందారన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఒక జాతీయ స్థాయి సినిమాగా అదిరిపోయే కాంబినేషన్ తో ప్రకటింపబడ్డ ఈమూవీ ఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండానే వరుసగా సమస్యలలో చిక్కుకుంటున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

 

 ఇప్పటికే రకరకాల కారణాలతో సంగీత దర్శకుడుగా ఎ.ఆర్.రెహమాన్‌, ఛాయాగ్రాహకుడిగా రవివర్మన్‌ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న నేపథ్యంలో ఈమూవీలోని కీలక పాత్రలకు ఎంపిక అయిన అమితాబ్ బచ్చన్, సుదీప్ కూడా ఈ మూవీకి సంబంధించి సరైన స్పందన రావడంలేదని అంటున్నారు.  సినిమా షూటింగ్ డేట్స్ విషయంలో జరుగుతున్న జాప్యంతోపాటు ప్లానింగ్ లోపాలు కూడా ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

ముఖ్యంగా అమితాబ్ విషంయలో కూడ చాల డౌట్లు ఉన్నాయి అని అంటున్నారు. దీనికితోడు సుదీప్, సేతుపతి లాంటి వాళ్లెవ్వరూ.. ‘సైరా’ లో తాము నటించబోతున్నట్లు తమకు తాముగా చెప్పుకోవడం లేదు. మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నందుకు ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో కామెంట్స్, అప్ డేట్స్ పెడతారనుకుంటే.. అటువంటి స్పందన వీరివద్ద నుంచి రాకపోవడంతో ‘సైరా’ విషయంలో ఎక్కడో ఎదో లోపం జరుగుతోంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

డిసెంబర్ 6 నుంచి ఈసినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని వార్తలు వస్తూ ఉన్నా ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటనా రాకపోవడంతో ‘సైరా’ షూటింగ్ మళ్ళీ వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దీనికితోడు ఈసినిమా విడుదల వచ్చే సంవత్సరం కాకుండా 2019 సంక్రాంతికి అంటున్నారు కాబట్టి కాస్ట్ అండ్ క్రూ విషయంలో మరిన్ని తేడాలు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఏమైనా ప్లానింగ్ లో ఏదో లోపం వున్నట్లు మాత్రం కనిపిస్తోంది.

loader