200కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి సవాల్ గా తీసుకున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి సురెందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజదీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురెందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్ లోనే షూటింగ్ కూడా ప్రారంభించాల్సి వుంది.
ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. సైరా షూటింగ్ ప్రారంభం మరింత ఆలస్యం కానుందని దాని సారాంశం. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ మూవీ నుంచి ఏ.ఆర్.రెహమాన్ వైదొలగినట్లు కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే ఇదో తప్పుడు ప్రచారంగా కొట్టిపారేసింది ప్రొడక్షన్ హౌజ్.
ఇక తాజాగా సైరా సినిమాటోగ్రఫర్ రవివర్మన్ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం నుంచి కొన్ని వ్యక్తిగత కారణాలతో రవివర్మన్ తప్పుకుంటున్నట్లుగా వినిపిస్తోంది.
మరోవైపు సైరా షూటింగ్ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నానక్ రామ్ గూడలో ప్రత్యేక సెట్ నిర్మాణం జరిగింది. ఇక్కడే షూటింగ్ షెడ్యూల్ ప్రారంబం కావాల్సి వుంది. కానీ రవివర్మన్ తప్పుకోవడంతో షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రవి వర్మన్ స్థానంలో కొత్త మరొకరిని తీసుకునేందుకు మరికొంత సమయం పట్టేలా వుంది.
మరోవైపు సైరాను ఎలాగైనా అనుకున్న సమయానికి పూర్తి చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని భావిస్తున్న రామ్ చరణ్, సురెందర్ రెడ్డిలు బాహుబలి తరహాలో కమిట్ మెంట్ తో పని చేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కోసం అణ్వేషిస్తున్నారు. మొత్తానికి షూటింగ్ ప్రారంభం కావటానికి మరికొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
