రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ ఫుల్ గా దశాబ్ద కాలం తర్వాత ఖైదీ నెంబర్ 150తో తిరిగొచ్చి టాలీవుడ్ లో తన స్టామినా ఏంటో నిరూపించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. స్టైలిష్ డైరెక్టర్  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "సైరా నరసింహారెడ్డి"  మూవీ "డిజిటల్ రైట్స్‌" ని "అమెజాన్ ప్రైమ్" సంస్థ ఏకంగా ₹30 కోట్లతో టోటల్ ఇండియా రైట్స్‌ ని సొంతం చేసుకుందని సమాచారం. 

 

"ఫస్ట్ లుక్ టు ట్రైలర్" వరకు ప్లస్ మేకింగ్ వీడియోలపై.. అన్ని హక్కులు దక్కించుకున్న "అమెజాన్ ప్రైమ్" ఇంత అట్రాక్టివ్ అమౌంట్ ఇచ్చి ఓ సినిమాను డిజిటల్ రైట్స్ కొనడం ఇదే మొదటిసారి. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌కి రెడీ అవుతోంది.

 

చిత్రీకరణ ఇంకా జరుగుతుండగానే ఇటువంటి గ్రేట్ ఆఫర్ రావడంతో సోషల్ మీడియా అంతా చిరు స్టామినా అంటే ఇదంటూ జోరుగా సంబరాలు జరుపుకుంటున్నారు. "మెగాస్టారా! మజాకా! చిరంజీవికే ఆ సత్తా ఉంది, ఆయనే సాధించలేని దాన్ని కూడా సాధించగలరని వన్ & ఓన్లీ చిరంజీవి" అంటూ సోషల్ మీడియాలోఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతూ తెగ షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ జపన్నామ స్మరణతో మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.