'రంగస్థలం'లో చిరు 'సై.. రా'!

First Published 16, May 2018, 1:31 PM IST
sye ra movie shooting in rangasthalam sets
Highlights

రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిన విషయమే

రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో తెలిసిన విషయమే.. ఈ సినిమా కోసం హైదరాబాద్ బూత్ బంగాళా పరిసరాల్లో రంగస్థలం ఊరి సెట్ ను వేశారు. సినిమా షూటింగ్ అయిపోయినా ఆ సెట్ ను మాత్రం తీయలేదు. ఇప్పుడు అదే సెట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ జరగబోతుందని సమాచారం.అసలు విషయంలోకి వస్తే.. చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి 'సై రా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా మరో షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సిద్ధమవుతోంది చిత్రబృందం. కథ ప్రకారం విలేజ్ నేపధ్యంలో నడిచే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సివుంది. దీనికోసం చరణ్ 'రంగస్థలం' సినిమా కోసం వేసిన సెట్స్ ను ఉపయోగించనున్నారు. రంగస్థలం సినిమా సెట్ లోనే కొన్ని మార్పులు చేర్పులు చేసి 'సై రా' షూటింగ్ ను నిర్వహించనున్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార జంటగా కనిపించనుంది.  బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 150 నుండి 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. 

loader