స్వీటీ స్లిమ్ అయింది.. మళ్లీ తిరిగి స్వీట్ గా మారింది

sweety anushka slim pic gone viral
Highlights

  • టాలీవుడ్ లో టాప్ హిరోయిన్స్ లో ముందుండే అనుష్క షెట్టి
  • బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న అనుష్క
  • తాజాగా అనుష్క స్లిమ్ అయినట్లు ఫేస్ బుక్ లో ఓ పిక్

తెలుగులో అగ్ర హీరోయిన్ ఎవరా అంటే ఇప్పుడు ఫస్ట్ వినిపించేది అనుష్క పేరే. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన దేవసేన అనుష్క. అయితే.. నటనకు ప్రాధాన్యతనిచ్చే అనుష్క 'సైజ్ జీరో' మూవీ కోసం తన శరీర బరువును పెంచుకొని లావెక్కింది. ఆ తరువాత ఆమె ఎంతగా బరువు తగ్గడానికి ప్రయత్నించినా కుదర్లేదు. ఆఖరికి రాజమౌళి వంటి దర్శకులు ఆమెను గ్రాఫిక్స్ సహాయంతోనే బాహుబలిలో సన్నగా చూపించారని వినిపించింది. అయితే లేటెస్ట్‌గా అనుష్క షేర్ చేసిన ఫోటో చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.ఆమె షేర్ చేసిన ఫోటోలో చాలా స్లిమ్‌గా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోను తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. 'మ్యాజిక్ ద్వారా కల నిజమైపోదు. దానికోసం శ్రమించాలి, కృషి చేయాలి' అంటూ ఒక లైన్ కూడా రాసింది. దీంతో అనుష్క స్లిమ్ అయిందని అందరూ అనుకుంటుంటే.. ఈ ఫోటో ఇప్పటిది కాదని మరికొందరు అంటున్నారు.

 

అమ్మడు నిజంగానే స్లిమ్ అయిందా..? లేక ఆ రేంజ్‌లో కష్టపడాలని చెబుతోందా? దీనికి అనుష్క క్లారిటీ ఇస్తే బాగుంటుంది. స్వీటీ అభిమానులు మాత్రం ఈ ఫోటోను చూస్తూ తెగ సంతోషపడిపోతున్నారు. ఈ ఫోటోలో స్వీటీ మెరుపుతీగలా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతూ తెగ షేర్‌ చేస్తుండటంతో ఈ పిక్ వైరల్ అయ్యింది.

loader