BrahmaMudi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

ఈరోజు ఎపిసోడ్ లో ఒకవైపు స్వప్నని పెళ్లికూతుర్ని చేస్తుండగా మరొకవైపు రాజ్ ని పెళ్ళికొడుకుని చేస్తూ ఉంటారు. అప్పుడు కనకం స్వప్నకి బొట్టు పెట్టబోతుండగా చేయి పక్కకు నెట్టడంతో ఆ బొట్టు వెళ్లి కావ్య నుదుటిన పడుతుంది దాంతో అందరూ షాక్ అవుతారు. పెళ్లికూతురికి పెట్టాల్సిన బొట్టు పొరపాటున కూడా వేరే ఆడపిల్లకు పెట్టకూడదు నువ్వు కాస్త దూరంగా ఉండమ్మా అని అంటారు పక్కన ఆడవారు. మరొకవైపు రాజ్ ని పెళ్లి కొడుకుని చేస్తూ ఉండగా అప్పుడు రాహుల్ వాళ్ళ అమ్మ పూర్ ఫెలో పై వలలో చిక్కుకుంటున్నావు అనుకుంటూ ఉంటుంది.

 మరొకవైపు కావ్య తలపాగ వైపు చూస్తూ ఆ తలకాయ లేని మనిషికి మళ్లీ తలపాగ ఒకటి దీనిని ఇప్పుడు ఆ ఇంట్లోకి ఎలా చేర్చాలి అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు కావ్య పంపించిన గంప బుట్టా అని చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ తలపాగా కనిపించకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలోనే కళ్యాణ్ కి కావ్య ఫోన్ చేసి కవి గారు మీ అన్నయ్య పక్కనే ఉన్నాడా కాస్త జాగ్రత్తగా వినండి తలపాగ మా ఇంట్లోనే ఉంది అనడంతో సరే నేను వచ్చి తలపాగ కలెక్ట్ చేసుకుంటాను అని కళ్యాణ్ అనగా అవసరం లేదు వాళ్లే తీసుకొని వస్తారు అని రాజ్ ఫోన్ తీసుకొని తప్పు మీదే మీరే తీసుకుని రండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

కావ్య ఈ మనిషి ఎప్పుడూ ఇంతే ఏం జరిగిందో తెలియకుండానే కోప్పడుతూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు దీనిని ఎవరు తీసుకెళ్తారు. నాకే తప్పేలా లేదు నేనే తీసుకొని వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది కావ్య. మరొకవైపు రాహుల్ మీడియా అమ్మాయిని పిలిచి ఆమెతో ఏంటి చాలా అందంగా ఉన్నావు అనగానే నీకోసమే అని అంటుంది. అది సరే ఎప్పటికప్పుడు లోపల అప్డేట్ లను నాకే ఇవ్వాలి నేనే ముందుగా టెలికాస్ట్ చేయాలి అనగా నేనుండేది అందుకే కదా అని అంటాడు రాహుల్. అప్పుడు వారిద్దరూ రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాహుల్ రిపోర్టర్ తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో స్వప్న ఫోన్ చేయడంతో నువ్వు చేస్తావని నాకు తెలుసు నిన్ను ఎంతలా అవాయిడ్ చేస్తే నువ్వు నాకు అంత దగ్గరవుతావు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటాడు.

 అప్పుడు స్వప్న ఈ రాహుల్ కి ఏమైంది అనుకుంటూ ఉంటుంది. మరోవైపు కనకం టైం అవుతుంది ఆ పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా పసుపు పంపించలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి స్వప్న వచ్చి అమ్మ నేను ఒక్క విషయం చెప్పాలి చెప్పేది వింటావా లేదా అని గట్టిగా అరవడంతో ఏంటే కొట్టేలా ఉన్నావు చెప్పు ఏంటో అని అంటుంది. ఇప్పుడు రాహుల్ తెలుసు కదా అమ్మ ఆ రాహుల్ ని మాట్లాడదాము అనడంతో నువ్వు ఎంత మంచి దానివే అయినా ఆ రాహుల్ కి మన కావ్యకి బాగా సెట్ అవుతుంది నువ్వు సూపర్ అని అనడంతో కావ్య షాక్ అవుతుంది.

అప్పుడు కనకం నా ఆయుషు పోసుకొని కూడా సంతోషంగా జీవించు అనడంతో కావ్య కనకం గొంతు పట్టుకొని నిన్ను చంపుతాను అనే గొంతు పట్టుకొని నలుముతూ ఉంటుంది. అయితే అదంతా జరిగినట్టు కలకంటుంది స్వప్న. ఇంతలోనే అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించగా వాళ్ళకి పెద్దమ్మ వచ్చి కనకం ని పిలుచుకొని వెళుతుంది. మరొకవైపు తలపాగ ఇవ్వడానికి కావ్య రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ రాజ్ యముడి లాగా ఇక్కడే ఉన్నాడే ఇప్పుడు ఎలా ఇవ్వాలి అనుకోని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ కి ఇచ్చి అక్కడి నుంచి మెల్లగా తప్పించుకుని వెళ్ళిపోతుంది కావ్య.

 అప్పుడు సెక్యూరిటీ ఆ తలపాగ తీసుకుని వెళ్లి రాజ్ కి ఇవ్వడంతో వాళ్ళు రాలేదా అనగా వచ్చి ఒక అమ్మాయి ఇచ్చి వెళ్ళింది సార్ అనడంతో కళావతి వచ్చిందా అనుకుంటూ ఉంటాడు రాజ్. మరొకవైపు రాహుల్ స్వప్న కోసం తానే స్వయంగా పసుపు కుంకుమ అన్ని తీసుకొని వెళ్లడంతో రాహుల్ ని చూసిన స్వప్న కోపంగా అక్కడికి వస్తుంది. అప్పుడు రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. రాహుల్ మాత్రం కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఏమయింది రాహుల్ కి నా వైపు అసలు చూడడం లేదు అనుకుంటూ ఉంటుంది స్వప్న. అప్పుడు పసుపు పోయడం కార్యక్రమం మొదలు పెడుతూ ఉండగా అప్పుడు స్వప్న రాహుల్ వైపు చూస్తూ ఉంటుంది.

అప్పుడు కావాలనే స్వప్న కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా నటించడంతో రాహుల్ టెన్షన్ గా స్వప్న ని అక్కడినుంచి తీసుకొని వెళ్తాడు. ఒకవైపు రాజ్ ని వాళ్ళ మరదలు ఆటపట్టించడంతో పరిగెత్తుకుంటూ వెళుతుండగా అనుకోకుండా కావ్యకి డాష్ ఇవ్వడంతో వాళ్ళిద్దరూ పడిపోతుండగా ఇద్దరు చిటికెన వేలు పట్టుకుని బ్యాలెన్స్ అవుతారు. అప్పుడు కావ్య తన మొఖం కనిపించకుండా చీర కప్పుకుని అక్కడ నుంచి వెళ్లిపోవడంతో రాజ్ పిలుస్తూ ఉండగా ఇంతలో ఇంట్లో వాళ్ళు పిలవడంతో రాజ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు స్వప్న నీ లోపలికి తీసుకొని వెళ్లిన రాహుల్ స్వప్నకు ఏమయిందో అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో కొందరు ముత్తైదువులు అన్నీ వరుసగా అరిష్టాలు జరుగుతున్నాయి అనడంతో కనకం పట్టించుకోకుండా లోపలికి వెళ్లి సప్న ను నిద్ర లేపుతుంది.

 ఇంతలో స్వప్న లేవడంతో వద్దు అంటే విన్నావా డేటింగ్ పేరుతో ఎలా పడిపోయావో చూడు అని కనకం టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు స్వప్న ఎలా అయినా విరిద్దరిని ఇక్కడి నుంచి పంపించి నేను రాహుల్ తో మాట్లాడాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు స్వప్న కనకం వల్ల పెద్దమ్మని ఇద్దరినీ ఏదో ఒక సాకు చెప్పి అక్కడ నుంచి పంపించేస్తుంది.