రానా కవర్ చేస్తున్నా.. విషయం మాత్రం సీరియసే!

First Published 19, Jun 2018, 1:44 PM IST
Suresh Babu worried about Rana Daggubati's Health
Highlights

'బాహుబలి' సినిమాలో కండలు తిరిగిన దేహంతో యుద్ధాలు చేసిన భల్లాలదేవుడు రానాకు ఇప్పుడు 

'బాహుబలి' సినిమాలో కండలు తిరిగిన దేహంతో యుద్ధాలు చేసిన భల్లాలదేవుడు రానాకు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. ఎంతో ఫిట్ గా కనిపించే రానాకు ఆరోగ్య సమస్యలు రావడం అభిమానులను షాక్ కు గురి చేసింది. రానాకు ఒక కన్ను కనిపించదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దానికోసం సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఆ కన్ను కారణంగా ఆయన ఆరోగ్యం మరింత పాడయ్యే అవకాశం ఉన్నప్పటికీ రానాకు మాత్రం ఆ విధంగా జరగకపోవడం డాక్టర్లు సైతం  ఆశ్చర్యపోయారట. కానీ ఆయన కంటికి ఆపరేషన్ గనుక నిర్వహిస్తే శరీరంలో మిగిలిన అవయవాలకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందట. పైగా రానాకు బ్లడ్ ప్రెషర్ కూడా ఉండాల్సినదానికంటే ఎక్కువ ఉందని తెలుస్తోంది. బయటకు నేను ఫిట్ గా ఉన్నాను.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని రానా చెబుతోన్న విషయం మాత్రం చాలా సీరియస్ ను సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ విషయం సురేష్ బాబుని ఎంతో బాధకు గురి చేస్తుందని వచ్చిన వార్తలు కూడా వాస్తవమే. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకుకి సర్జరీ చేయించడం ఆయనను మరింత భయాందోళనకు గురి చేస్తుందని చెబుతున్నారు. రీసెంట్ గా రానా ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ లో దర్శనమిచ్చాడు. ఆయనను చూసిన వారంతా షాక్ అయ్యారు. భారీ శరీరం మొత్తం కోల్పోయి చాలా సన్నగా తయారయ్యాడు. దానికి కారణం కూడా ఆయన ఆరోగ్య సమస్యలే అని తెలుస్తోంది.   
 

loader