- Home
- Entertainment
- Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే
Long Delayed Movies: చిరంజీవి నుంచి నాగ చైతన్య వరకు.. లాంగ్ డిలే వల్ల అడ్రస్ లేకుండా పోయిన 8 సినిమాలు ఇవే
సినిమా వాయిదా పడడం అనేది ఊహించని శాపంగా మారుతుంది. వాయిదా పెరిగే కొద్దీ సినిమాకి ఉండే బజ్ పోతుంది. ఫలితంగా మంచి సినిమాలు కూడా డిజాస్టర్ అవుతుంటాయి. టాలీవుడ్లో ఎక్కువ కాలం వాయిదా పడిన 8 సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Long Delayed Movies
ఎంత గొప్ప సినిమాకి అయినా ఎక్కువ కాలం వాయిదా అనేది శాపంగా మారుతుంది. గతంలో ఏళ్లతరబడి వాయిదా పడడంతో కొన్ని టాలీవుడ్ చిత్రాలు డిజాస్టర్ రిజల్ట్ చూశాయి. చిరంజీవి, గోపీచంద్, రాంచరణ్, నాగ చైతన్య ఇలా చాలా మంది హీరోలకు ఈ పరిస్థితి ఎదురైంది టాలీవుడ్ లో లాంగ్ డిలే వల్ల ఫ్లాపైన 8 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అంజి
మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి చిత్రం టెక్నికల్ గా బ్రిలియంట్ మూవీ. అప్పట్లోనే గ్రాఫిక్స్ విషయంలో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేశారు. కానీ ఆరేళ్లపాటు ప్రొడక్షన్ లోనే వివిధ సమస్యలతో ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి 2004లో రిలీజ్ చేశారు. అప్పటికే ఆ చిత్రానికి ఉన్న క్రేజ్ మొత్తం పోయి ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. కానీ ఇప్పుడు అభిమానులు దీనిని కల్ట్ మూవీ అని అభివర్ణిస్తుంటారు.
ఆరడుగుల బుల్లెట్
గోపీచంద్ హీరోగా డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 8 ఏళ్ళు ప్రొడక్షన్ లో డిలే అవుతూ వచ్చింది. చివరికి ఈ చిత్రాన్ని 2021లో రిలీజ్ చేశారు. రిలీజ్ టైంకి ఈ కథ అవుట్ డేటెడ్ అయిపోయింది. దీనితో డిజాస్టర్ రిజల్ట్ తప్పలేదు. కరెక్ట్ టైంలో రిలీజ్ అయి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది.
ఆటోనగర్ సూర్య
దేవకట్టా దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం మూడేళ్లు వాయిదా పడుతూ 2014లో రిలీజ్ అయింది. క్రిటిక్స్ అభినందించారు కానీ ఈ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్.
కొరియర్ బాయ్ కళ్యాణ్
నితిన్ నటించిన ఈ చిత్రం మూడేళ్లు ప్రొడక్షన్ లోనే వాయిదా పడుతూ వచ్చింది. షార్ట్ ఫిలిం కి ఎక్కువ సినిమాకి తక్కువ అన్నట్లు ఈ మూవీ ఉంటుంది. ఈ మాత్రం దానికే అన్నేళ్లు టైం పట్టిందా అనే విమర్శలు వినిపించాయి.
రేయ్
అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే సాయిధరమ్ తేజ్ కి ఇది డెబ్యూ మూవీ అయి ఉండేది. వైవిఎస్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు ఆర్థిక సమస్యల కారణంగా ఈ చిత్రం 5 ఏళ్ళు వాయిదా పడింది. చివరికి 2015లో రిలీజ్ చేశారు. దీనితో ఫ్లాప్ రిజల్ట్ తప్పలేదు .
1945
రానా దగ్గుబాటి ఫ్రీడమ్ ఫైట్ నేపథ్యంలో నటించిన చిత్రం ఇది. 2016లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో రానా బాహుబలి 2 తో బిజీగా ఉన్నారు. దీనితో 1945 షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. చివరికి 2022లో రిలీజ్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.
గేమ్ ఛేంజర్
మెగా అభిమానులకు అతిపెద్ద నిరాశ మిగిల్చిన చిత్రం ఇది. శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ తొలి సారి నటిస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ శంకర్ ఇండియన్ 2 చిత్రంతో బిజీగా ఉండడం వల్ల మూడేళ్లకు పైగా వాయిదా పడుతూ వచ్చింది. పైగా అవుట్ డేటెడ్ పొలిటికల్ స్టోరీ కావడంతో డిజాస్టర్ అయింది. నిర్మాతకు ఈ చిత్రంతో భారీ నష్టాలు తప్పలేదు.
హరి హర వీరమల్లు
పవన్ కళ్యాణ్ హిస్టారిక్ వారియర్ పాత్రలో నటించిన ఈ చిత్రం 5 ఏళ్ళ పాటు లాంగ్ డిలే అయింది. షూటింగ్ ఆలస్యం, బడ్జెట్ సమస్యలు ఇలా పలు కారణాలతో 5 ఏళ్ళు ప్రొడక్షన్ లోనే గడిచిపోయింది. చివరికి క్వాలిటీ కాంప్రమైజ్ అయి 2025లో రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో అభిమానులకు నిరాశ తప్పలేదు.

