వెంకటేష్‌ చాలా జోవియల్‌గా ఉంటారు. కానీ ఆయనలో ఒక పెద్ద బలహీనత ఉంది. ఆ రహస్యాన్ని బయటపెట్టాడు అన్నయ్య సురేష్‌ బాబు.  

వెంకటేష్‌ ఇప్పటి వరకు 76 సినిమాలు చేశారు. చాలా వరకు విజయవంతమైన మూవీస్‌ చేసి విక్టరీ వెంకటేష్‌గా పేరు తెచ్చుకున్నాడు. వాటిలో ఎక్కువగా రీమేక్‌ మూవీస్‌ ఉన్నాయి. తండ్రి రామానాయుడు జడ్జ్ మెంట్లో ఆయన సినిమాలు చేసి హిట్లు కొట్టారు. సక్సెస్‌ఫుల్‌ హీరో అయ్యారు. తండ్రి రామానాయుడు మరణం తర్వాత ఆ జోరు కనిపించడం లేదు. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అన్నయ్య సురేష్‌ బాబు ఉన్నా, ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఆ డేర్ చూపించడం లేదు.

అయితే టాలీవుడ్‌ టాప్‌ 4 స్టార్స్ లో ఒకరిగా నిలిచారు వెంకటేష్‌. వెంకీమామగా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న వెంకటేష్‌ లో ఒక బలహీనత ఉందట. తాజాగా ఆ విషయాన్ని అన్నయ్య, నిర్మాత సురేష్‌ బాబు బయట పెట్టాడు. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న `అన్‌ స్టాపబుల్` షోలో వెంకటేష్‌ తోపాటు సురేష్‌ బాబు కూడా పాల్గొన్నారు. ఇందులో వెంకటేష్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వెంకీ చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడని, చెన్నైలో పెద్ద గొడవలు పెట్టుకునేవాడని, ప్రిన్సిపల్స్ ని కూడా ఏడిపించాడని తెలిపారు సురేష్‌ బాబు. కానీ ఇప్పుడు ఆయా కాలేజీలు, స్కూల్స్ లో ఫేమస్‌ పర్సన్స్ గురించి రాస్తే వెంకటేష్‌ పేరే రాస్తారని చెప్పడం విశేషం. 

వెంకటేష్‌లో ఉన్న వీక్‌నెస్‌ ఏంటి? అనేది చెబుతూ, సినిమా షూటింగ్‌లో ఏదైనా సీన్‌ రాకపోతే, మూమెంట్‌ రాకపోతే చేతిని తల వెనకాల పెడతాడని, అలా పెట్టాడంటే ఇక ఆ సీన్‌ రానట్టే అని, అదే పెద్ద మైనస్‌ అని చెప్పారు. అలా ఏ సినిమాకైనా, ఏ సందర్భంలో అయినా చేసినా ఆ రోజు ఆ సీన్‌ ఇక తెగదు. డైరెక్టర్లకి ఆ రోజు చుక్ ప్యాకప్‌ చెప్పుకోవాల్సిందే అని తెలిపారు సురేష్‌ బాబు. ఆ బలహీనత ఇప్పటికీ ఉందని, ఇప్పుడు కూడా అలానే చేస్తుంటాడని తెలిపారు. అయితే చాలా సినిమాల్లో ఆయన దాన్ని ఒక మ్యానరిజంగా చూపించడం విశేషం. 

 తమ మధ్య గొడవల గురించి చెబుతూ, ఒకటి రెండు సార్లు బాగా కొట్టుకున్నామని, అయితే సురేష్‌ బాబు బలంగా ఉండేవాడట. వెంకీని కొట్టేవాడట. అన్నయ్యని ఓడించాలంటే బూతు పదాలు వాడేవాడట వెంకీ. దీంతో సురేష్‌ బాబు వెంటనే వదిలేసేవాడట. ఆ మాటల రియల్‌ మీనింగ్‌ తీసుకుని హర్ట్ అయిపోయేవాడట. దీంతో గొడవ ఒడిసిపోయేదని తెలిపారు. తనకు బూతులంటే తెలియదని, వెంకీనే చాలా నేర్పించాడని, ఫారెన్‌ వెళ్లినప్పుడు ఇతర ఫ్రెండ్స్ నేర్పించేవారని తెలిపారు సురేష్‌ బాబు. 

ఆద్యంతం ఎమోషనల్‌గా వీరి చిట్‌చాట్‌ జరిగింది. ఈ క్రమంలో తండ్రి గురించి చెబుతూ ఇద్దరు ఎమోషనల్‌ అయ్యారు. నాన్న రామానాయుడు తీరని రెండు కోరికలున్నాయని, వెంకీతో కలిసి నటించాలని, ఆ చివరి సినిమా హిట్‌ కొట్టాలని ఉండేదని, అది తీరలేదన్నారు. అలాగే ఎంపీగా గెలవలేకపోయాననే బాధ ఆయనలో ఉందని, అది తలుచుకుంటే బాధగా ఉంటుందని ఎమోషనల్‌ అయ్యారు. ఇక ప్రస్తుతం వెంకటేష్‌ `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలో నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ మూవీ సంక్రాంతికి జనవరి 15న విడుదల కాబోతుంది.

read more: రామానాయుడి తీరని రెండు కోరికలు, గుర్తు చేసుకుంటూ బాలయ్య షోలో వెంకటేష్‌, సురేష్‌బాబు ఎమోషనల్‌

also read: మహేష్‌ సినిమా కాస్టింగ్‌పై సర్‌ప్రైజింగ్‌ అప్‌ డేట్, రాజమౌళి క్లారిటీ ఇచ్చేది అప్పుడేనా?