మహేష్ సినిమా కాస్టింగ్‌పై సర్‌ప్రైజింగ్ అప్ డేట్, రాజమౌళి క్లారిటీ ఇచ్చేది అప్పుడేనా?
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రావాల్సిన సినిమాకి సంబంధించిన సర్‌ప్రైజ్ అప్ డేట్ రాబోతుంది. రాజమౌళి క్లారిటీ ఇచ్చేది అప్పుడే అని తెలుస్తుంది.
మహేష్ బాబు ఈ ఏడాది `గుంటూరు కారం`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ సంక్రాంతి పండుగ కావడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయని తెలుస్తుంది. ఇక సర్‌ప్రైజింగ్‌గా ఈ నెల 31న ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇయర్ ఎండింగ్‌లో భాగంగా ఫ్యాన్స్ ని అలరించేందుకు ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
ఇదిలా ఉంటే మహేష్ కొత్త సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. రాజమౌళి దర్శకత్వంలో ఆయన సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. పలు ఇంటర్వ్యూలలో ప్రకటించారు తప్పితే అధికారికంగా ఇది అని ఇప్పటి వరకు చెప్పలేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి మాత్రం స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారు. కాస్టింగ్, టెక్నీషియన్లని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఆయన బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.
`ఆర్‌ఆర్‌ఆర్` రిలీజ్ అయి రెండేళ్లు అయిపోయింది. అయినా మహేష్ సినిమా స్టార్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. సినిమా ఎప్పుడు ప్రారంభమనేది కూడా క్లారిటీ లేదు. రైటర్ విజయేంద్రప్రసాద్ పలు మార్లు వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ రాజమౌళి నుంచి వచ్చే ప్రకటనే క్లారిటీ ఉంటుంది. ఆయన ఎప్పుడు చెబుతారనేది పెద్ద సస్పెన్స్. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. మహేష్ సినిమాకి సంబంధించిన అప్ డేట్ రాబోతుందట. ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. జనవరి 26 వరకు ఓ క్లారిటీ వస్తుందట. ప్రచారం నిజమైతే ఆ రోజే ఈ మూవీ ప్రకటన ఉండబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే కాస్టింగ్ కి సంబంధించిన క్రేజీ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. `సలార్` నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అలాగే ఒకప్పటి బాలీవుడ్ నటి, ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా రాణిస్తున్న ప్రియాంక చోప్రా పేరు కూడా లీక్ అయ్యింది. కానీ ఇందులో నిజం లేదని సమాచారం. అలాగే విక్రమ్ పేరు కూడా ఆ మధ్య చక్కర్లు కొట్టింది. అది కూడా క్లారిటీ లేదు. మరోవైపు ఇందులో హాలీవుడ్ హీరోయిన్ నటించబోతుంది, న్యూజిలాండ్ హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ పేరు ప్రధానంగా వినిపించింది. కానీ దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో అన్ని కుదిరితే జనవరి 26న క్లారిటీ వస్తుందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇక ఇంటర్నేషనల్ యాక్షన్ అడ్వెంచరస్‌గా, ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందని, మహేష్ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని అటు రాజమౌళి, ఇటు విజయేంద్రప్రసాద్ తెలిపారు. అందుకోసమే ఇప్పుడు సరికొత్త మేకోవర్ అవుతున్నారని సమాచారం. ఇటీవల మహేష్ లుక్ షాకింగ్‌గా ఉంది. గెడ్డంతో, పెంచిన జుట్టుతో సరికొత్తగా కనిపించాడు. ఇది రాజమౌళి సినిమా కోసమే అని సమాచారం.
also read: సోనూ సూద్‌కి ముఖ్యమంత్రి పదవి ఆఫర్.. కన్ఫమ్ చేసిన రియల్ స్టార్, ఏం జరిగిందంటే?