శ్రీరెడ్డి.. అదొక దురదృష్టకర ఘటన: సురేష్ బాబు

suresh babu comments on actress sri reddy
Highlights

కాస్టింగ్ కౌచ్, డ్రగ్స్, సెక్స్ రాకెట్ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాయని ప్రతి ఇండస్ట్రీలో ఇది కామన్ అని అన్నారు. ఏదైనా ఒక విషయం బయటకి వస్తే మాత్రం అది జనాల్లోకి బాగా వెళ్తుందని అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా.. సినిమా ఇండస్ట్రీ మాత్రం ముందుకు నడుస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు.

కాస్టింగ్ కౌచ్ విషయంలో తన కామెంట్స్ తో టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించింది నటి శ్రీరెడ్డి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ పై ఆమె చేసిన ఆరోపణలు వివాదాలకు దారి తీశాయి. అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను లీక్ చేసి శ్రీరెడ్డి హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయంపై సురేష్ బాబు ఫ్యామిలీ కానీ అభిరామ్ కానీ ఎప్పుడూ స్పందించలేదు.

చాలా కాలం పాటు బయట మీడియాలో కూడా కనిపించలేదు. అయితే రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన సురేష్ బాబుకి శ్రీరెడ్డి కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సమాధానంగా అదొక దురదృష్టకర ఘటన అని వెల్లడించారు సురేష్ బాబు. కాస్టింగ్ కౌచ్, డ్రగ్స్, సెక్స్ రాకెట్ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాయని ప్రతి ఇండస్ట్రీలో ఇది కామన్ అని అన్నారు. ఏదైనా ఒక విషయం బయటకి వస్తే మాత్రం అది జనాల్లోకి బాగా వెళ్తుందని అన్నారు.

ఎన్ని సమస్యలు వచ్చినా.. సినిమా ఇండస్ట్రీ మాత్రం ముందుకు నడుస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు. పరోక్షంగా మీడియాపై కూడా కామెంట్స్ చేశారు. టీవీలు, పత్రికల విషయంలో హాలీవుడ్ కొన్ని లిమిట్స్ పెట్టుకొని పని చేస్తుందని కానీ ఇక్కడ ఎవరినీ రాయకుండా ఆపలేమని అన్నారు. 
 

loader