Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారిని దర్శించుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సుప్రభాత సేవలో తలైవా..

తీర్ధయాత్రలు చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలకు బయలుదేరారు. అందులో భాగంగా.. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా  దర్శించుకున్నారు రజనీ కాంత్. 

Superstar Rajinikanth Visit Tirumala Temple
Author
First Published Dec 15, 2022, 12:37 PM IST


తీర్ధయాత్రలు చేస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలకు బయలుదేరారు. అందులో భాగంగా.. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా  దర్శించుకున్నారు రజనీ కాంత్. 

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిరోజు కొన్ని వేల మంది దర్శిచుకుంటారు. రోజుకు ఎంతో మంది సెలబ్రిటీలు తిరుమల దర్శనంతో పులకించిపోతారు. ఈక్రమంలోనే  తమిళ  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఈరోజు గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రజనీకాంత్. ఆతరువాత స్వామివారి ప్రత్యేక పూజల నిర్వహించారు. ఇక  అనంతరం.. రజనీకాంత్‌ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఇక తిరుమల నుంచి నేరుగా రజనీకాంత్‌  కడప వెళ్ళనున్నారు. అక్కడ కొలువై ఉన్న అమీన్‌పీర్‌ దర్గాను ఆయన  దర్శించుకోనున్నారు. రజిని కాంత్ తో పాటుగా ఈదర్గాను  మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ కూడా సందర్శించనున్నట్టు సమాచారం. రెహమాన్ కు ఈ దర్గం ఎంతో సెంటిమెంట్ ఏడాదికి ఒక్కసారి అయినా.. ఈ దర్శను దర్శించుకుంటారు రెహమాన్. వీలు కుదిరినప్పుడల్లా.. రెహమాన్ ఈ దర్గాకు వస్తారు. ఈక్రమంలోనే రజనీ కాంత్ తో కలిసి కడప దర్గలో సందడి చేయబోతున్నాడురెహమాన్. 

Follow Us:
Download App:
  • android
  • ios