కాలా ట్విట్టర్ రివ్యూ..

super star rajini starrer kala movie review
Highlights

రజినీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఇతర దేశాల్లో కూడా  ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇక ఆయన సినిమా విడుదలయ్యిందంటే అభిమానులకు పండగే.  ఆయన నటించిన తాజా చిత్రం ‘కాలా’. పా.రంజిత్ దర్శకత్వం వహించగా.. రజినీ అల్లుడు, హీరో ధనుష్.. నిర్మాతగా వ్యహరించారు. ఎన్నో అంచనాలతో కాలా సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాని వీక్షించిన కొందరు ప్రేక్షకులు.. తమ అభిప్రాయలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వారి ట్వీట్ల ప్రకారం.. రజినీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనని తెలుస్తోంది. కథ కొత్తగా లేకపోయినప్పటికీ.. రజినీ మాస్ లుక్ లో అదరగొట్టేశారంటున్నారు.

ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌గా ఉండి కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చారని.. రజినీకాంత్ ఇంట్రో సీన్, రెయిన్ ఫైట్ సీన్స్ అదిరిపోయాయి అంటున్నారు. ఇక సెకండాఫ్ మొత్తం హక్కుల పోరాటం దశగా సాగిందంటున్నారు.సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని ట్వీటుతున్నారు. ఓవరాల్ గా ఇప్పటికే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక కాలా పూర్తి రివ్యూ కావాలంటే.. మరికొద్ది సేపు ఆగాల్సిందే.
 

loader